Foods Replace Eggs: గుడ్డు అంటే అలర్జీనా..? ఇవి తింటే గుడ్డులోని పోషకాలు అందుతాయి..!

[ad_1]

బాదం..

బాదం..

బాదంను సూపర్‌ఫుడ్‌ అనొచ్చు. బాదంలో ఫైబర్, ప్రొటీన్, విటమిన్ ఈ, కాల్షియం, జింక్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మెదడు, కళ్లు, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ప్రతి రోజు బాదం నానబెట్టి తింటే.. ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. (image source – pixabay)

Eye Sight:ఈ 5 అలవాట్ల కారణంగా.. మీ కంటి చూపు తగ్గుతుంది..!

అరటిపండు..

అరటిపండు..

గుడ్డుకు అరటిపండు గొప్ప ప్రత్యామ్నాయం అని చెప్పొచ్చు. అరటిపండు ఏడాది పొడవునా లభిస్తాయి. అరటి పండులో దాదాపు అన్ని సూక్ష్మ, స్థూల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అరటిపండులో కార్బోహైడ్రేట్లు, విటమిన్‌ ఏ, సి, బి6, బి12 ఐరన్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, సోడియం, పొటాషియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Wrong food combinations: భోజనం చేసిన వెంటనే పండ్లు తింటున్నారా..?

చియా సీడ్స్‌..

చియా సీడ్స్‌..

చియా సీడ్స్‌ సూపర్‌ ఫుడ్‌ అని పిలుస్తారు. దీనిలో తగుపాళ్లలో ప్రొటీన్‌ దొరుకుతుంది. అంతేకాదు వీటిలో అమైనో ఆమ్లాలు తగిన పరిమాణంలో ఉంటాయి. చియా సీడ్స్‌లో ప్రొటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం ఎముకలు పటిష్టంగా ఉండేలా తోడ్పాటు అందిస్తాయి. ఇందులో కూడా ఒమెగా 3 ఉంటుంది. అలాగే చియా సీడ్స్‌ యాంటీ ఆక్సిడంట్స్‌గా పనిచేస్తాయి. చియా సీడ్స్‌ను స్మీతీ, బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవచ్చు. గుడ్డుకు చియా సీడ్స్‌ బెస్ట్‌ రీప్లేస్‌మెంట్‌ అనొచ్చు.

Uric acid: ఈ కాండం రసం తాగితే.. యూరిక్‌ యాసిడ్‌ సమస్య తగ్గుతుంది..!

కందిపప్పు..

కందిపప్పు..

కంది పప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పప్పుని రోజూ తినడం వల్ల మేలు చేసే ప్రొటీన్లూ, కొవ్వులూ, కార్బో హైడ్రేట్‌లూ శరీరానికి అందుతాయి. తక్షణ శక్తినీ అందిస్తాయి. దీనిలో ఫోలేట్‌ అధికంగా ఉంటుంది. ఇది మహిళలకు మేలు చేస్తుంది. కందిపప్పు తరచుగా తింటే.. కొన్ని రకాల గుండె వ్యాధులనూ, క్యాన్సర్లతో పాటు టైప్‌-2 డయాబెటిస్‌నూ అదుపులో ఉంచే శక్తి దీనికి ఉందంటున్నాయి అధ్యయనాలు.

(image source – pixabay)

పెరుగు..

పెరుగు..

పెరుగులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్‌, పాస్పరస్‌, విటమిన్‌ బి-12, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. పెరుగులోని పోషకాలు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. పెరుగు రోజు తీసుకుంటే.. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి ఎముకలను బలంగా ఉంచుతుంది.

(image source – pixabay)

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *