Forbes: ఫోర్బ్స్ లిస్టులో నలుగురు భారత మహిళలకు చోటు.. వారెవరంటే..

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


Forbes:

మారుతున్న
కాలానికి
అనుగుణంగా
మహిళలు
కూడా
పురుషులతో
పాటు
అన్ని
రంగాల్లో
రాణిస్తున్నారు.
ఇంకా
చెప్పాలంటే
కొన్నింటిలో
పురుషులను
వెనక్కి
నెట్టి
మరీ
మంచి
ఫలితాలు
సాధిస్తున్నారు.
ఇలా
విజయవంతమైన
మహిళలను
గుర్తిస్తూ,
ఫోర్బ్స్
సంస్థ
ఏటా
100
మంది
జాబితాను
విడుదల
చేస్తుంటుంది.
ఈదఫా
తాజా
లిస్టును
సంస్థ
రిలీజ్
చేసింది.

అమెరికాలో
అత్యంత
విజయవంతమైన
100
మంది
మహిళలతో
కూడిన
2023
జాబితాను
ఫోర్బ్స్
విడుదల
చేసింది.
ఇందులో
నలుగురు
భారతీయ
అమెరికన్
వ్యాపారవేత్తలు
ఉండటం
విశేషం.
ఇంద్రా
నూయి,
నేహా
నార్ఖేడే,
జయశ్రీ
ఉల్లాల్
మరియు
నీర్జా
సేథిలు
ఇందులో
చోటు
దక్కించుకున్నారు.

Forbes: ఫోర్బ్స్ లిస్టులో నలుగురు భారత మహిళలకు చోటు.. వారెవర

ఇంద్రా
నూయి
పెప్సికో
చైర్‌పర్సన్
గా,
CEOగా
పనిచేశారు.
ప్రపంచంలోని
100
మంది
అత్యంత
శక్తివంతమైన
మహిళలలో
ఆమె
స్థానం
స్థిరంగా
కొనసాగుతున్నారు.
తమిళనాడులోని
చెన్నై
ఆమె
స్వస్థలం
కాగా..
2014లో
ప్రపంచంలోని
100
మంది
అత్యంత
శక్తివంతమైన
ఫోర్బ్స్
మహిళల
జాబితాలో
13వ
స్థానం
సాధించారు.

క్లౌడ్
నెట్‌వర్కింగ్
కంపెనీ
అరిస్టా
నెట్‌వర్క్స్
ప్రెసిడెంట్
మరియు
CEOగా
జయశ్రీ
ఉల్లాల్
పనిచేస్తున్నారు.
అత్యంత
విజయవంతమైన
భారతీయ
అమెరికన్
మహిళగా
ఆమె
15వ
స్థానంలో
నిలిచారు.
మిచిగాన్‌
లోని
ట్రాయ్‌లో
నీర్జా
సేథి
తన
కన్సల్టింగ్,
అవుట్
సోర్సింగ్
సంస్థ
సింటెల్‌ను
స్థాపించారు.
దీనిని
ఫ్రెంచ్
IT
సంస్థ
అటోస్
SE
కొనుగోలు
చేసింది.
ఆమె
25వ
స్థానం
సాధించారు.

Forbes: ఫోర్బ్స్ లిస్టులో నలుగురు భారత మహిళలకు చోటు.. వారెవర

నేహా
నార్ఖేడే
ఒక
భారతీయ
అమెరికన్.
స్ట్రీమింగ్
డేటా
టెక్నాలజీ
కంపెనీ
కన్‌ఫ్లూయెంట్‌కు
సహ
వ్యవస్థాపకులు.
గతంలో
చీఫ్
టెక్నాలజీ
ఆఫీసర్
(CTO)గా
సైతం
పనిచేశారు.
ఓపెన్
సోర్స్
సాఫ్ట్
వేర్
ప్లాట్
ఫారమ్
అపాచీ
కాఫ్కాను
రూపొందించడంలో
ప్రముఖ
పాత్ర
వహించారు.
2020లోనూ
ఫోర్బ్స్
అమెరికా
సెల్ఫ్
మేడ్
ఉమెన్
జాబితాలో
చోటు
దక్కించుకున్నారు.

English summary

Four Indian origin women listed on Forbes top 100 American successful women

Four Indian origin women listed on Forbes top 100 American successful women

Story first published: Saturday, July 8, 2023, 22:18 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *