Ford Layoffs: ఉద్యోగుల కోత ప్రకటించిన యూఎస్ ఆటో దిగ్గజం.. ఫోర్డ్ నిర్ణయం అందుకే..

[ad_1]

భారీగా తొలగింపులు..

భారీగా తొలగింపులు..

తాజాగా ఫోర్డ్ భారీ సంఖ్యలోనే ఉద్యోగులను తగ్గించనుంది. ఈ క్రమంలో కంపెనీకి చెందిన 3,800 మంది ఉపాధి కోల్పోనున్నారు. ప్రధానంగా యూకే, జర్మనీ, యూరప్ లోని ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు దీనివల్ల ప్రభావితం కానున్నారని తెలుస్తోంది. రానున్న మూడేళ్ల కాలంలో ఈ తొలగింపులు ఉండనున్నట్లు కంపెనీ తెలిపింది.

కారణం అదే..

కారణం అదే..

ఫోర్డ్ మోటార్స్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవటానికి ఒక ప్రధాన కారణం ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపార రంగంలో ప్రత్యర్థి కంపెనీల నుంచి పెద్ద పోటీని ఎదుర్కొంటున్నందున తొలగింపులు తప్పటం లేదని తెలుస్తోంది. 2025 నాటికి యూరోపియన్ ఇంజనీరింగ్ వ్యాపారాన్ని రీస్ట్రక్చర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఉద్యోగుల తొలగింపు నిర్ణయం జరిగిందని వార్తా కథనాలు చెబుతున్నాయి.

ఆ విభాల నుంచే.

ఆ విభాల నుంచే.

జర్మనీలో ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్‌లలో కంపెనీ 2,300 మందిని తొలగించనున్నట్లు ఫోర్డ్ పేర్కొంది. అలాగే యూకేలో దాదాపు 1,300 మంది ఉద్యోగులను, యూరప్ లోని కొన్ని ప్రాంతాల్లో మరో 200 మంది ఉద్యోగులను రానున్న మూడేళ్ల కాలంలో తొలగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. యూరప్‌లోని ఫోర్డ్ మోడల్ E జనరల్ మేనేజర్, మార్టిన్ శాండర్ దీనిపై స్పందిస్తూ.. ఇది కష్టమైన నిర్ణయమని, రానున్న నెలల్లో దీనిని ఎదుర్కొనేందుకు ఉద్యోగులకు మద్ధతు అందిస్తామని హామీ ఇచ్చారు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *