Ford Layoffs: మెున్న ఐటీ ఇప్పుడు ఆటోనూ.. ఆగని ఉద్యోగాల కోతలు.. మెగా లేఆఫ్

[ad_1]

ఫోర్డ్ నిర్ణయం..

ఫోర్డ్ నిర్ణయం..

యూఎస్ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ యూరప్ వ్యాప్తంగా 3,200 మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి తోడు కంపెనీ కొన్ని ఉత్పత్తుల అభివృద్ధి పనులను యుఎస్‌కి మార్చాలని ప్లాన్ చేసినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. అందుకే కంపెనీ అభివృద్ధి పనులలో 2,500 మందిని, అడ్మిన్ డిపార్ట్ మెంట్లో 700 మందిని తొలగించాలని చూస్తోంది.

ఎవరిపై ప్రభావం..

ఎవరిపై ప్రభావం..

కంపెనీ తీసుకోనున్న ఈ నిర్ణయం వల్ల జర్మనీకి చెందిన ప్రజలు ఎక్కువగా ప్రభావితమౌతారని తెలుస్తోంది. కార్‌మేకర్ కొలోన్ సైట్‌లో దాదాపు 14,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. అలాగే ఐరోపాలో సుమారు 45,000 మంది ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తోంది. అయితే ఈ తొలగింపులు ఇక్కడికి పరిమితం అవుతాయా లేక రానున్న కాలంలో మరింతగా పెరుగుతాయా అనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు.

కొత్త మోడల్స్..

కొత్త మోడల్స్..

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రవాణా వాహనాలను శిలాజ ఇంధనం నుంచి ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. దీనిలో భాగంగా అటు తయారీ సంస్థలకు, ఇటు వినియోగదారులకు మంచి ప్రోత్సాహకాలను సైతం అందిస్తున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ఫోర్డ్ మోటార్స్ కొత్తగా 7 ఎలక్ట్రిక్ మోడళ్లను మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమౌతోంది. వీటి కోసం జర్మనీ, టర్కీలలో తయారీ సైట్లను సైతం ప్లాన్ చేస్తోంది.

బాధ్యత వహిస్తున్న..

బాధ్యత వహిస్తున్న..

ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన మైక్రోసాఫ్ట్, గూగుల్ సీఈవోలు తొలగింపులకు బాధ్యత వహించారు. దీనికి ముందు అమెజాన్, సేల్స్ ఫోర్స్, నెట్ ఫ్లిక్స్, ట్విట్టర్, మెటా వంటి దిగ్గజాలు కోతలను ప్రకటిస్తూ ఆర్థిక పరిస్థితులను దీనికి కారణాలుగా చూపాయి. ఇక భారత కంపెనీల విషయానికి వస్తే ముందుగా విప్రో 400 మంది ఫ్రెషర్లను తొలగిస్తున్నట్లు వెల్లడించింది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *