FY 2023లో దిమ్మతిరిగే కార్ల అమ్మకాలు నమోదు.. టాప్ కార్ మేకర్స్ ఏమంటున్నారంటే..?

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Car Sales: మారుతీ సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్ గత ఆర్థిక సంవత్సరంలో తమ డీలర్లకు అత్యధికంగా వాహనాలను డెలివరీ ఇచ్చినట్లు వెల్లడించాయి. దేశీయ ప్రయాణీకుల వాహన పరిశ్రమ ఇప్పటి వరకు అత్యుత్తమ పనితీరును నమోదు చేయడానికి వీలు కల్పించింది.

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా 19 శాతం వృద్ధితో 19,66,164 యూనిట్లను నమోదు చేసింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా గత ఆర్థిక సంవత్సరంలో తమ మొత్తం హోల్‌సేల్స్ దేశంలో కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి అత్యధికమైనవని పేర్కొంది. ఆటోమేకర్ గత ఆర్థిక సంవత్సరంలో 7,20,565 యూనిట్లను డీలర్లకు డెలివరీ చేసింది.

FY 2023లో దిమ్మతిరిగే కార్ల అమ్మకాలు నమోదు..

టాటా మోటార్స్ గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ మార్కెట్లో అత్యుత్తమ ప్యాసింజర్ వాహన పంపిణీలను 5,38,640 యూనిట్లుగా నివేదించింది. ఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో 3,70,372 యూనిట్లుగా ఉంది. చిప్ కొరత ఉత్పత్తి కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నప్పటికీ కంపెనీ తమ అత్యధిక విక్రయాలను నమోదు చేసిందని మారుతీ సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు.

ఇక కియా మోటార్స్ విషయానికి వస్తే తాము కస్టమర్లకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఫ్యూచరిస్టిక్ డిజైన్‌ను అందించడంపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించింది. భారత మార్కెట్లకు, న్యూ ఏజ్ కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీ ఈ ప్రయత్నం చేస్తోంది. తమ విజయపరంపరను కొనసాగిస్తామని నమ్మకంగా ఉన్నట్లు కియా ఇండియా VP అండ్ సేల్స్ & మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ తెలిపారు.

ఇకపోతే టయోటా కిర్లోస్కర్ మోటార్స్ కూడా తన అమ్మకాల్లో 41 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఏకంగా 1,74,015 యూనిట్లను విక్రయించినట్లు వెల్లడించింది. ప్యాసింజర్ వాహనాల సెగ్మెంట్ గత సంవత్సరం స్థిరమైన వృద్ధిని సాధించిందని కంపెనీ వెల్లడించింది. వివిధ మొబిలిటీ అవసరాలను తీర్చడానికి మార్కెట్లోకి లోతుగా ప్రవేశించడం ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నట్లు వైస్ ప్రెసిడెంట్, సేల్స్ అండ్ స్ట్రాటజిక్ మార్కెటింగ్ అతుల్ సూద్ తెలిపారు.

English summary

Indian car makers saw big growth sales in last financial year amid chip shortage issues

Indian car makers saw big growth sales in last financial year amid chip shortage issues

Story first published: Sunday, April 2, 2023, 15:19 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *