Gautam Adani: భారీ డీల్ రద్దు చేసుకున్న అదానీ.. ఏపీ, గుజరాత్‌లో నిర్ణయం వెనక్కి..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Gautam
Adani:

చాలా
కాలం
తర్వాత
హిండెన్
బర్గ్
నివేదిక
ఆరోపణల
నుంచి
అదానీ
గ్రూప్
కొంత
ఉపసమనం
పొందింది.
అయితే
ఆందోళనలు
మాత్రం
పూర్తిగా
తొలగిపోలేదు.

అదానీ
ఎంటర్‌ప్రైజెస్
లిమిటెడ్
విభాగమైన
అదానీ
రోడ్
ట్రాన్స్‌పోర్ట్
గుజరాత్,
ఆంధ్రప్రదేశ్‌లో
మాక్వేరీ
ఆసియా
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
ఫండ్
కు
చెందిన
రెండు
టోల్
స్ట్రెచ్‌లను
వరుసగా
రూ.3,110
కోట్లకు
కొనుగోలు
చేసే
ఒప్పందాన్ని
రద్దు
చేసుకున్నట్లు
గురువారం
వెల్లడైంది.
దీనికి
ముందు
2022
ఆగస్టులో
గుజరాత్
రోడ్
అండ్
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
కంపెనీ
లిమిటెడ్
(GRICL)ని
కొనుగోలు
చేయనున్నట్లు
అదానీ
సంస్థ
అప్పట్లో
ప్రకటించింది.

Gautam Adani: భారీ డీల్ రద్దు చేసుకున్న అదానీ.. ఏపీ, గుజరాత్

షేర్
పర్చేజ్
అగ్రిమెంట్
ప్రకారం
షరతులతో
సంతృప్తి
చెందని
కారణంగా
షేర్
కొనుగోలు
ఒప్పందాన్ని
రద్దు
చేయాలని
నిర్ణయించినట్లు
స్టాక్
ఎక్స్ఛేంజ్
ఫైలింగ్‌లో
అదానీ
ఎంటర్‌ప్రైజెస్
తెలిపింది.
ఇదే
క్రమంలో
స్వర్ణ
టోల్
వే
ప్రైవేట్
లిమిటెడ్
ఆంధ్రప్రదేశ్‌లోని
NH-16
(తడ

నెల్లూరు),
NH-65
(నందిగామ

ఇబ్రహీంపట్నం-
విజయవాడ)
కలిగి
ఉంది.
వీటిని
సైతం
అదానీ
గ్రూప్
గతంలో
దక్కించుకోవాలనుకుంది.

హిండెన్‌బర్గ్
నివేదిక
వల్ల
అదానీ
ఎంటర్‌ప్రైజెస్
షేర్
ధర
చుట్టూ
ఉన్న
ప్రస్తుత
అస్థిరత
పరిష్కారమయ్యే
వరకు
కొత్త
రోడ్
ప్రాజెక్ట్‌లలో
తాజా
పెట్టుబడులు
పెట్టదని
ఫిబ్రవరిలో
ఎకనామిక్
టైమ్స్
వార్తా
సంస్థ
నివేదించింది.
ప్రస్తుతం

ప్రణాళికలో
భాగంగానే
అదానీ
వెనకడుగు
వేశారా
అని
మార్కెట్
వర్గాలు
భావిస్తున్నాయి.
చిక్కుల్లో
ఉన్న
సంస్థ
కొత్త
ప్రాజెక్టులను
తీసుకోవటానికి
ముందుగా
గంగా
ఎక్స్‌ప్రెస్‌వేతో
సహా
ఇప్పటికే
ఉన్న
పెండింగ్
ప్రాజెక్టులను
పూర్తి
చేయడంపై
దృష్టి
పెడుతుందని
నివేదిక
పేర్కొంది.

English summary

Adani enterprises terminates road toll collection deals in gujarath and andhrapradesh

Adani enterprises terminates road toll collection deals in gujarath and andhrapradesh

Story first published: Friday, June 2, 2023, 11:46 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *