Global Economy: 2023 అంత ఈజీ కాదంటున్న IMF MD.. మరి భారతీయుల పరిస్థితి ఏమిటి..?

[ad_1]

మందగించిన దేశాలు..

మందగించిన దేశాలు..

ప్రపంచంలో మూడు పెద్ద ఆర్థిక వ్యవస్థలైన యూఎస్, యూరోపియన్ యూనియన్, చైనాలు ఏకకాలంలో మందగమనాన్ని చూడటం తీవ్రతకు అద్ధ పడుతోందని క్రిస్టాలినా వెల్లడించారు. అందుకే అక్టోబర్ మాసంలో 2023 ప్రపంచ ఆర్థిక వృద్ధిపై అంచనాలను తగ్గించింది. ధరల ఒత్తిడి నుంచి రష్యా దండయాత్ర వరకు ఉన్న అనేక అంతర్జాతీయ కారణాలు ఆర్థిక వ్యవస్థలను కిందకు లాగుతూనే ఉన్నాయి.

చైనా కొత్త కష్టాలు..

చైనా కొత్త కష్టాలు..

గతంలో చైనా అనుసరించిన జీరో కొవిడ్ పాలసీ వల్ల చాలా పరిశ్రమలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయి. దీనికి తోడు ఉత్పత్తి మందగించటంతో అంతర్జాతీయంగా ఆ ప్రభావం పడింది. ఈ షాక్ నుంచి దిగ్గజ కంపెనీల కోలుకోకముందే కరోనా కొత్త వేరియంట్ చైనాను అల్లాడిస్తోంది. రోజూ లక్షల్లో ప్రజలు వైరస్ బారిన పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వేల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారనే వార్తలు మళ్లీ ప్రపంచంలోని ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. 40 ఏళ్లలో తొలిసారి చైనా వృద్ధి ప్రపంచ వృద్ధి కంటే తక్కువగా ఉంటుందని ఆమె అంచనా వేశారు.

రానున్న నెలల్లో..

రానున్న నెలల్లో..

రానున్న కొన్ని నెలల్లో కొవిడ్ ఇన్‌ఫెక్షన్ల “బుష్‌ఫైర్” చైనాను మాత్రమే కాక ఇతర ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీసే అవకాశం ఉందని తెలుస్తోంది. రానున్న రెండు నెలలు చైనాకు మరింత కష్టకాలం అని జార్జివా వెల్లడించారు. గత వారం చైనాలో పర్యటించిన ఆమె వాస్తవ పరిస్థితులను గమనించారు. చైనాతో పాటు ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలపై మరోసారి కోత ఉండవచ్చని సూచనప్రాయంగా చెప్పారు.

అమెరికా పరిస్థితి..

అమెరికా పరిస్థితి..

యూఎస్ మార్కెట్ ప్రస్తుతం స్టేబుల్ గా ఉందని.. మాంద్యాన్ని నివారించవచ్చని ఆమె అన్నరు. దీనికి తోడు అక్కడ లేబర్ మార్కెట్ సైతం బలంగా ఉన్నట్లు చెప్పారు. ఫెడ్ చర్యలు చేపట్టినప్పటికీ 2022లో అమెరికాలో ద్రవ్యోల్బణం రేటు అమాంతం పెరిగింది. నిర్ధేశిత లక్ష్యానికి మూడు రెట్లు రేటు చేరుకోవటం ఆందోళనకు దారితీసింది. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఫెడ్ వడ్డీ రేట్లను ఎక్కువ కాలం కఠినంగా ఉంచవలసి ఉంటుందని జార్జివా చెప్పారు. 1980 తర్వాత ఇంత దూకుడుగా రేట్లను పెంచటం ఇప్పుడు కొనసాగుతోంది. వడ్డీ రేటు ఏకంగా మార్చిలో సున్నా నుంచి 4.50 శాతానికి పెంచటం జరిగింది.

భారత్ పరిస్థితి..

భారత్ పరిస్థితి..

భారతీయ రిజర్వు బ్యాంక్ అంతర్జాతీయ మార్కెట్లు, వివిధ సెంట్రల్ బ్యాంకులు తీసుకుంటున్న నిర్ణయాలకు అనుగుణంగా పాలసీ రేట్లను మార్చుతోంది. అయితే ఇండియాలో కూడా వడ్డీ రేట్లు భారీగా పెంచుతున్న తరుణంలో ఇండస్ట్రీ వర్గాలు వేగాన్ని తగ్గించాలని ప్రభుత్వానికి ఇప్పటికే విన్నవించాయి. ఇది పరోక్షంగా డిమాండ్ మందగమనానికి కారణంగా మారుతోందని వారు అంటున్నారు. ఐటీ మందగమనం భారత ఆదాయానికి గండికొడుతోంది. రూపాయి విలువ పతనం.. భారత వాణిజ్య లోటును భారీగా పెంచింది. మెుత్తానికి భారత్ సైతం 2023లో కొంత టఫ్ పరిస్థితులను ఎదుర్కోకతప్పదని తెలుస్తోంది. అయితే వీటిని ఎదుర్కోవటానికి నిర్మలమ్మ ఫిబ్రవరిలో తెచ్చే వార్షిక బడ్జెట్లో ఎలాంటి ప్రణాళికలతో వస్తారనేది వేచి చూడాల్సిందే.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *