Gold price today: దేశంలో బంగారం ధరలపై ఒకటే చర్చ.. నేడు తెలుగురాష్ట్రాల్లో ధరలిలా!!

[ad_1]

నేడు బంగారం ధరల పరిస్థితి

నేడు బంగారం ధరల పరిస్థితి

అంతర్జాతీయ మార్కెట్ తో సంబంధం లేకుండా ఒక్కోసారి దేశంలో బంగారం ధరలు పెరగడం తగ్గడం కూడా ఇటీవల కనిపిస్తుంది. అంతర్జాతీయంగా ప్రతికూల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బంగారం ధరలలో క్షీణత కంటే ధరల పెరుగుదలే ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక నేడు ఇండియన్ మార్కెట్లో బంగారం ధరల విషయానికి వస్తే.. నేడు బంగారం ధరలు పెరిగినట్టుగా కనిపిస్తుంది.

హైదరాబాద్, విశాఖపట్నం లలో బంగారం ధరలు ఎంతంటే

హైదరాబాద్, విశాఖపట్నం లలో బంగారం ధరలు ఎంతంటే

ఫిబ్రవరి 9న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర దేశంలో 57,540 కాగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,700గా ప్రస్తుతం కొనసాగుతుంది. హైదరాబాద్ లో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి 52,750 వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతుండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,550 వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. విశాఖపట్నంలో నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52 వేల 750 రూపాయల వద్ద అమ్మకాలు జరుగుతుండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,550 వద్ద ట్రేడ్ అవుతుంది.

ఢిల్లీ, ముంబైలలో బంగారం ధరలు ఇలా..

ఢిల్లీ, ముంబైలలో బంగారం ధరలు ఇలా..

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,700 రూపాయలు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52,900గా ట్రేడ్ అవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,750గా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,550గా ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలతో ఒక గ్రామ బంగారం కొనుగోలు చేయాలన్నా సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకపక్క పెళ్లిళ్లు సీజన్ కావడంతో శుభకార్యాలు చేసేవారు సైతం బంగారాన్ని కొనుగోలు చేయాలంటే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.

 అంతర్జాతీయ మార్కెట్ లో ప్రస్తుతం బంగారం ధర ఎంత ఉందంటే

అంతర్జాతీయ మార్కెట్ లో ప్రస్తుతం బంగారం ధర ఎంత ఉందంటే

ఇక మరొక అంతర్జాతీయ మార్కెట్లను బంగారం ధరల పెరుగుదల కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరను చూస్తే, అమెరికా మార్కెట్లో బంగారం ధర 0.31 శాతం పెరిగి ఔన్సుకు 1,890.70 డాలర్లు వద్ద ట్రేడ్ అవుతుంది. అదే సమయంలో, వెండి 22.42 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే ఈ వారం బంగారం హెచ్చుతగ్గులతో కొనసాగుతోంది. కానీ బంగారం ధరలు భారీగా తగ్గిన దాఖలాలు లేవు. మొత్తంగా చూస్తే పెరుగుతున్న బంగారం ధరలు ఇప్పుడు బంగారాన్ని అమితంగా ఇష్టపడే భారతదేశ వాసులలో మాత్రం ఆసక్తికర చర్చకు కారణంగా మారాయి.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *