Gold price today: బంగారం ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. పైపైకి పసిడి ధర; హైదరాబాద్‌లో ఎంతంటే!!

[ad_1]

హైదరాబాద్ లో బంగారం ఈరోజు ధరలు ఇలా

హైదరాబాద్ లో బంగారం ఈరోజు ధరలు ఇలా

ఇక ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కు 1858 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ సిల్వర్ ధర కూడా ఔన్స్ కు 23.89 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.62 రూపాయలుగా ఉంది. ఇదిలా ఉంటే ఇక దేశీయంగా బంగారం ధర విషయానికి వస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర ఈరోజు ఇప్పటివరకు 10 గ్రాములకు 51 వేల 100 రూపాయలుగా ఉంది. నిన్న 50,950 రూపాయలుగా ఉన్న బంగారం ధర నేడు 150 రూపాయల మేర పెరిగింది. హైదరాబాద్లో 24 క్యారెట్ బంగారం ధర తులానికి ఈరోజు ఇప్పటివరకు 55, 750 రూపాయలు గా ఉంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం నిన్న 55,580 గా ఉంది. నిన్నటికి ఈరోజుకి 170 రూపాయలు 24 క్యారెట్ల బంగారం ధర పెరిగింది.

 దేశ రాజధాని ఢిల్లీ లో పెరిగిన బంగారం ధరలు ఇలా

దేశ రాజధాని ఢిల్లీ లో పెరిగిన బంగారం ధరలు ఇలా

దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే ఢిల్లీలో నేడు ఇప్పటివరకు 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల కు 51,250 రూపాయలుగా ఉంది. నిన్న 22 క్యారెట్ల బంగారం ధర 51 వేల 100 రూపాయలుగా నమోదైంది. నిన్నటికి నేటికి 150 రూపాయల మేర 22 క్యారెట్ల బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీలో నేడు 55,900 రూపాయలు గా నమోదయింది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశ రాజధాని ఢిల్లీలో 55, 730 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా 170 రూపాయలు పెరిగినట్టు కనిపిస్తుంది.

 ముంబై లోనూ బంగారం ధరల దూకుడు

ముంబై లోనూ బంగారం ధరల దూకుడు

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నేడు బంగారం ధరలు విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈరోజు ఇప్పటివరకు 51 వేల 100 రూపాయలు గా ఉంది. ఢిల్లీలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ధర కొనసాగుతోంది. నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ముంబైలో 50, 950 రూపాయలుగా ఉంది. ఇదిలా ఉంటే ముంబై లో 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు ఇప్పటివరకు 55,750 రూపాయలుగా ఉంది. నిన్నటి ధర విషయానికి వస్తే 55,580 రూపాయలుగా ముంబై లో బంగారం ధర నమోదయింది. గత పది రోజుల్లో చూసుకుంటే కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే బంగారం ధరలు తగినట్టుగా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే గత పది రోజులుగా బంగారం ధరలు దూకుడుగా ట్రేడ్ అవుతున్న పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

 పెరుగుతున్న వెండి ధరలు.. హైదరాబాద్, ఢిల్లీలో వెండి ధరలు ఇలా

పెరుగుతున్న వెండి ధరలు.. హైదరాబాద్, ఢిల్లీలో వెండి ధరలు ఇలా

ఇదిలా ఉంటే వెండి ధరలు కూడా ఇటీవల భారీగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. వరుసగా రెండు రోజుల్లో వెండి 1200 రూపాయల మేర పెరిగింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో వెండి ధర 75 వేల500 రూపాయల వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర 72 వేల రూపాయల వద్ద కొనసాగుతోంది. ఢిల్లీ తో పోలిస్తే హైదరాబాద్ లో వెండి ధర ఎక్కువగా ఉంది. ఇక ఈ స్థాయిలో వెండి ధరలు పెరగడం కూడా ఈ మధ్య కాలంలో ఇదే అని చెప్పొచ్చు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *