[ad_1]
నేడు అంతర్జాతీయంగా, జాతీయంగా పెరిగిన బంగారం ధర
అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతున్న కారణంగా మళ్లీ యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెరుగుతాయని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మళ్లీ బంగారం ధర తగ్గింది. గత రెండు వారాలలో ఏకంగా 1400 రూపాయలు మేర బంగారం ధర తగ్గింది. అయితే నేడు అంతర్జాతీయంగానూ, దేశీయంగాను బంగారం ధరల పెరుగుదల కాస్త కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర నేడు స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కు 1825 డాలర్ల వద్ద కొనసాగుతుంది. ఇదిలా ఉంటే దేశీయ మార్కెట్లో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం మీద 100 రూపాయలు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం మీద 100 రూపాయల మేర పెరిగింది.
హైదరాబాద్, ఢిల్లీ, ముంబై లలో బంగారం ధరలు ఇలా
ఇక హైదరాబాద్లో బంగారం ధరల విషయానికొస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ప్రస్తుతం 51,450 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం హైదరాబాద్లో 56,120 రూపాయల వద్ద కొనసాగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే 51,600 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 56,270 రూపాయల వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,450 ప్రస్తుతం కొనసాగుతుంటే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56 వేల 120 రూపాయల వద్ద కొనసాగుతుంది.
విజయవాడ, విశాఖ, బెంగళూరులలో బంగారం ధరలు ఇలా
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,450 రూపాయలుగా ఉండగా, 10 గ్రాముల 22 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56వేల 120 రూపాయల వద్ద కొనసాగుతుంది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక బెంగళూరులో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర బెంగళూరులో 51,500గా ప్రస్తుతం కొనసాగుతుండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,170 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.
స్వల్పంగా పెరిగిన వెండి ధరలు
ఇక బంగారం ధరలతో పాటుగా వెండి ధరలు కూడా కాస్త పెరిగినట్టుగా తెలుస్తుంది. ఈరోజు వెండి కిలోకి 200 రూపాయల మేర పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో వెండి ధర 69,200 వద్ద కొనసాగుతుంది. ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర 66 వేల 800 రూపాయల వద్ద కొనసాగుతుంది.
[ad_2]
Source link
Leave a Reply