[ad_1]
సుప్రీం తలుపుతట్టిన గూగుల్:
వాటి భద్రత కోసం ఫోన్ల తయారీదారులే అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని టెక్ దిగ్గజం అభిప్రాయ పడింది. తద్వారా ఫోన్ల ధరలు పెంచాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పింది. NCLAT సైతం ట్రిబ్యునల్ ఆదేశాలపై మధ్యంతర స్టేకు నిరాకరించడంతో.. చివరకు సుప్రీం కోర్టు ఎదుట ఈనెల 16న గూగుల్ తన వాదనలు వినిపించనుంది.
చిన్న డెవలపర్లకు పెద్ద దెబ్బ..
ప్రస్తుత అండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా చిన్న డెవలపర్లు సైతం చాలా తేలికగా అప్లికేషన్లు తయారు చేసి వినియోగదారులకు అందించగలుగుతున్నారని గూగుల్ పేర్కొంది. పెద్ద డెవలపర్లతో పోటీపడే స్థాయిలో ఉన్నారంది. ‘ఫోర్క్’ల వల్ల ఈ తరహా అవకాశం లభించదని అభిప్రాయపడింది. తద్వారా నాణ్యతతో సంబంధం లేకుండా పెద్ద డెవలపర్లే ఆధిపత్యం సాధించే ప్రమాదం ఉందని పేర్కొంది. సైబర్ క్రైమ్, బగ్స్, మాల్వేర్ పరంగా ఎదుర్కొనే సమస్యలపై సీసీఐ పునరాలోచించాలని కోరింది.
సీసీఐ ఆదేశాలేంటి ?
అండ్రాయిడ్ ఎకో సిస్టంలో తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలపై.. గత రెండు ఆదేశాల్లో గూగుల్‌కు రూ. 1,337 కోట్లు, రూ. 936 కోట్లు సీసీఐ జరిమానా విధించింది. అంతేకాకుండా అండ్రాయిడ్ మార్కెట్, ప్లే స్టోర్‌లోనూ సంస్థ గుత్తాధిపత్యాన్ని నిరోధించడానికి పలు మార్పులు చేయాలని ఆదేశించింది. ఫోన్ల తయారీదారులు గూగుల్ అందించే సెర్చ్, క్రోమ్, యూట్యూబ్, ఇతర అప్లికేషన్లను ముందుగా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా చూడాలని తీర్పునిచ్చింది. ప్లే స్టోర్ లైసెన్సింగ్‌ను ఇతర సర్వీసులతో ముడిపెట్టకూడదని వెల్లడించింది.
[ad_2]
Source link
Leave a Reply