GQII: జీక్యూఐఐ ర్యాంకుల్లో 5వ స్థానంలో భారత్.. తొలి స్థానంలో జర్మనీ..

[ad_1]

News

oi-Chekkilla Srinivas

|

ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ క్వాలిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ (GQII) 2021 ప్రకారం అక్రిడిటేషన్ సిస్టమ్ లో భారత్ ప్రపంచంలోని ఐదవ-అత్యుత్తమ దేశంగా స్థానం దక్కించుకుంది. మొత్తం 184 దేశాల్లో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. గ్లోబల్‌ క్వాలిటీ ఇన్‌ఫ్రా ఇండెక్స్‌ ఈ ర్యాంకులు విడుదల చేసింది. మౌలిక సదుపాయాల నాణ్యతపై ఆధారంగా ఈ ర్యాంకులు ప్రకటించారు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI) ప్రపంచంలోని మొదటి ఐదు అక్రిడిటేషన్ సిస్టమ్‌లలో భారత్ ను ఒకటిగా గుర్తించబడటం గర్వంగా ఉందని పేర్కొంది.

ఇది మౌలిక సదుపాయాల నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో సహకారానికి మార్గం సుగమం చేస్తుందని పేర్కొంది. ప్రపంచంలోని మొదటి 25 దేశాల్లో ప్రధానంగా ఆసియా-పసిఫిక్, ఉత్తర అమెరికా, ఐరోపా దేశాలు. ఈ జాబితాలో భారత్ కంటే జర్మనీ, అమెరికా, చైనా, ఇటలీ ఉన్నాయి. జర్మనీ అగ్రస్థానంలో ఉండగా.. ఇటలీ నాలుగో స్థానంలో ఉంది. చైనా మూడో స్థానంలో ఉంది. అమెరికా 2వ స్థానంలో ఉంది.

GQII: జీక్యూఐఐ ర్యాంకుల్లో 5వ స్థానంలో భారత్..

QCI అనేది భారత్ లో అక్రిడిటేషన్‌ను నిర్వహించే సంస్థ. ఇది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాలను అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటుంది. అంతర్జాతీయ వాణిజ్య సంఘంలో నాణ్యమైన మౌలిక సదుపాయాలు ముఖ్యమైనవి. ఇది వ్యాపార భాగస్వాముల మధ్య భద్రత, విశ్వసనీయతను పెంచడంలో సహాయపడతాయి. వివిధ వనరుల నుంచి సేకరించిన డేటా ఆధారంగా GQII ర్యాంకింగ్స్ ఇస్తుంది.

English summary

India stands fifth in the GQII rankings

According to the recently released Global Quality Infrastructure Index (GQII) 2021, India has been ranked as the fifth-best country in the world in the accreditation system.

Story first published: Saturday, February 11, 2023, 12:37 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *