[ad_1]
News
oi-Bogadi Adinarayana
gst: ప్రధాని మోడీ హయాంలో తీసుకొచ్చిన సంస్కరణల్లో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లింది GST. వివిధ రకాల పన్నులను తొలగించి, దేశం మొత్తాన్ని ఒకే పన్ను కిందకు తీసుకురావడానికి చేసిన ప్రయత్నమిది. వస్తు, సేవల పన్ను (GST) కింద ఈ నెలలో 1.56 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ జనవరి 31న వెల్లడించింది.
ఏప్రిల్ 2022లో వసూలు చేసిన 1.68 లక్షల కోట్ల తర్వాత ఇదే అత్యధికం కావడం విశేషం. అయితే ఈ నెలాఖరు రోజు వరకు చూస్తే ఇంకొంత పెరుగుదల ఉంటుందని పేర్కొంది.
రానున్న ఏడాదిలో వృద్ధి తక్కువే..
గతేడాది జనవరితో పోలిస్తే ప్రస్తుత వసూళ్లు 10.6 శాతం ఎక్కువని కేంద్రం వెల్లడించింది. వరుసగా 11 నెలలుగా GST వసూళ్లు 1.4 లక్షల కోట్లు దాటాయని ప్రకటించింది. 2022-23లో పన్ను వసూళ్లు బాగా పెరిగినప్పటికీ, నామమాత్రపు GDP వృద్ధి కారణంగా వచ్చే ఏడాది పెరుగుదల నెమ్మదిస్తుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. 2023-24లో ఈ వృద్ధి రేటు దాదాపు 11 శాతం ఉంటుందని కేంద్రం అంచనా వేస్తోంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనా 15.4 శాతం కంటే తక్కువేనని గ్రహించాలి.
భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు:
తక్కువ ద్రవ్యోల్బణం, బలహీనమైన వాస్తవ వృద్ధి కారణంగా నామమాత్రపు GDP వృద్ధి పడిపోతున్నట్లు ఆర్థిక సర్వే తెలిపింది. 2023-24 కి GDP వృద్ధి రేటు 6.5 శాతంగా అంచనా వేసింది. గణాంకాల శాఖ ముందస్తు అంచనాలో 50 బేసిస్ పాయింట్లను కుదించింది. జనవరిలో కేంద్ర జీఎస్టీ వసూళ్లు సుమారు 29 వేల కోట్లు రాగా.. రాష్ట్ర జీఎస్టీ 37 వేల కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ 80 వేల కోట్లు, సెస్సు రూపంలో 10 వేల కోట్లు వచ్చినట్లు పేర్కొంది. వీటిలో ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ నుంచి సెంట్రల్ జీఎస్టీకి 38 వేల కోట్లు, రాష్ట్రాల జీఎస్టీ కింద 32 వేల కోట్లను సెటిల్ చేసినట్లు తెలిపింది. తద్వారా కేంద్రం, రాష్ట్రాల మొత్తం ఆదాయాలు 67 వేల కోట్లు 69 వేల కోట్లని ప్రకటించింది.
గత ఏడాది జనవరి వరకు వచ్చిన GST వసూళ్లను ఈ నెల వరకు పోలిస్తే.. ఆదాయం 24 శాతం పెరిగినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల కారణంగా పన్ను బేస్, GST రిటర్నులు గణనీయంగా పెరిగినట్లు వెల్లడించింది.
English summary
January GST collections are second highest ever
GST collections upto january 2023
Story first published: Tuesday, January 31, 2023, 23:07 [IST]
[ad_2]
Source link
Leave a Reply