GST: 70 శాతం పెరిగిన తెలంగాణ GST కలెక్షన్స్.. పొరుగు రాష్ట్రాలు సైతం అసూయపడేలా..

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


GST:

రాష్ట్ర
విభజన
అనంతరం
ఏర్పడిన
తెలంగాణ
అభివృద్ధి
పథంలో
దూసుకుపోతోంది.
వివిధ
పెద్ద
రాష్ట్రాలు
సైతం
అందుకోలేని
ఫీట్స్
సాధిస్తూ
ముందుకు
సాగుతోంది.
కరోనా
మహమ్మారి
వంటి
అంతర్జాతీయ
ఆర్థిక
సవాళ్లను
సైతం
ధీటుగా
ఎదుర్కొని
ఔరా
అనిపిస్తోంది.
GST
వసూళ్లలో
చూపిన
వృద్ధే
దీనికి
ఉదాహరణగా
చెప్పుకోవచ్చు.

కంప్ట్రోలర్
అండ్
ఆడిటర్
జనరల్(కాగ్)
నివేదిక
ప్రకారం..
తెలంగాణ
GST
ఆదాయం
2018-19లో
దాదాపు
29
వేల
కోట్లుగా
ఉంది.
2022-23
నాటికి
ఇది
42
వేల
కోట్లకు
పెరిగింది.
అంటే
గత
4
ఏళ్లలో
13
వేల
కోట్లకు
పైగా
వృద్ధి
సాధించిందన్నమాట.
తద్వారా
GST
వసూళ్లలో
69
శాతం
వృద్ధి
రేటును
నమోదు
చేసిందని
స్పష్టమవుతోంది.

GST: 70 శాతం పెరిగిన తెలంగాణ GST కలెక్షన్స్..

కరోనా
వ్యాప్తి
వల్ల
అంతర్జాతీయంగా
ఆర్థిక
సవాళ్లు
ఎదురైనప్పటికీ,
GST
వసూళ్లలో
తెలంగాణ
జోరు
కొనసాగించింది.
లాక్‌డౌన్‌
సమయంలోను,
తదనంతరం
కూడా
మునుపటి
వృద్ధి
పథాన్ని
ఫాలో
అయింది.

విధంగా
తెలంగాణ
సుస్థిరాభివృద్ధి
సాధించడానికి
రాష్ట్ర
ప్రభుత్వం
చేపట్టిన
బలమైన
ఆర్థిక
విధానాలే
కారణమని
నిపుణులు
అభిప్రాయపడుతున్నారు.

ఇక
బడ్జెట్
అంచనాలతో
పోలిస్తే
గత
నాలుగేళ్లలో
ఒకసారి
మినహా
అన్నిసార్లు
90
శాతానికిపైగా
GST
వసూళ్లు
సాధించింది.
2019-20లో
31
వేల
కోట్లు
రాబడి
అంచనా
వేయగా,
అందులో
28
వేల
కోట్లు
అంటే
90
శాతం
రాబట్టింది.
ఇదే
విధంగా
2020-21లో
80,
2021-22లో
97
సాధించి
స్థిరమైన
వృద్ధిని
కనబరిచింది.
2022-23లో
అయితే
42.18
వేల
కోట్ల
అంచనాలో
41.88
రాబట్టి
దాదాపు
100
శాతానికి
చేరువైంది.

పటిష్ఠమైన
ఆర్థిక
వ్యూహంతో,
ఆర్థిక
వనరుల
సమర్ధవంతమైన
వినియోగంతో
ఇతర
రాష్ట్రాలకు
తెలంగాణ
ఆదర్శంగా
నిలిచింది.

అద్భుత
ఫలితాలు
సాధించడంలో
వాణిజ్య
పన్నుల
శాఖ
కీలక
పాత్ర
పోషించిందని
చెప్పాలి.
వివిధ
సంస్కరణలు
ప్రేవేశపెట్టడంతో
పన్ను
ఆదాయం
గణనీయంగా
పెరిగింది.
తెలంగాణ
అమలు
చేసిన
సంస్కరణలు
అధ్యయనం
చేయడానికి
గుజరాత్,
UP
వంటి
రాష్ట్రాలు
వచ్చాయంటే
పరిస్థితి
అర్థం
చేసుకోవచ్చు.

English summary

Telangana GST collections reach nearly 70% growth

Telangana GST collections reach nearly 70% growth

Story first published: Tuesday, June 20, 2023, 12:31 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *