HDFC నుంచి హోమ్ లోన్ తీసుకున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


HDFC-HDFC
Bank
Merger:

దేశంలోని
అతిపెద్ద
ప్రైవేటు
బ్యాంక్
హెచ్డీఎఫ్సీ,
హౌసింగ్
డెవలప్‌మెంట్
ఫైనాన్స్
కార్పొరేషన్
(HDFC)
చారిత్రక
విలీనం
జూలై
1,
2023
నుంచి
అమలులోకి
వచ్చింది.
దీంతో
HDFC
ఆఫీసులు
సైతం
బ్యాంకు
కిందకు
రానున్నాయి.

అయితే

విలీనం
HDFC
నుంచి
హోమ్
లోన్
తీసుకున్న
వారిని
ఎలా
ప్రభావితం
చేస్తుందనే
దానిపై
అనేక
ప్రశ్నలు
ఖాతాదారుల్లో
కొనసాగుతున్నాయి.
ముందుగా
లోన్
ఖాతా
నెంబర్లు
అలాగే
కొనసాగటంతో
పాటు
లోన్
అగ్రిమెంట్
నిబంధనలు
సైతం
యథాతథంగా
కొనసాగుతాయి.
విలీనం
తర్వాత
HDFC
లిమిటెడ్
పోర్టల్‌కి
యాక్సెస్‌ను
ఉంటుంది.
లాగిన్
క్రెడెన్షియల్స్
అందించి
గతంలో
మాదిరిగానే
సేవలను
పొందవచ్చు.
ఇప్పటికే
లోన్
పొంది
ఈఎంఐలు
ప్రారంభం
కాని
వారిపై
తాజా
విలీనం
ఎలాంటి
ప్రభావం
చూపదు.
వారి
EMI
లోన్
రీపేమెంట్
షెడ్యూల్
ప్రకారం
ప్రాసెస్
చేయబడుతుందని
గమనించాలి.

HDFC నుంచి హోమ్ లోన్ తీసుకున్నారా..?

కస్టమర్లు
గుర్తించాల్సిన
విషయం
ఏమిటంటే..
విలీన
తేదీ
అమలులోకి
వచ్చిన
తర్వాత
లోన్
ఖాతా
HDFC
బ్యాంక్‌కి
బదిలీ
చేయబడవచ్చు.
అయినప్పటికీ
లాగిన్
విషయంలో
ఎలాంటి
మార్పులు
ఉండవు.
అలాగే
HDFC
బ్యాంక్‌లో
సేవింగ్స్
లేదా
కరెంట్
ఖాతా
లేని
కస్టమర్‌లు
HDFC
బ్యాంక్
వెబ్‌సైట్‌లోని
హోమ్
లోన్
సెక్షన్
ద్వారా
తమ
హోమ్
లోన్
వివరాలను
యాక్సెస్
చేయవచ్చు.
ఒక
వేళ
రుణాన్ని
పాక్షికంగా
పొందినట్లయితే
అవసరమైన
వివరాలు
తెలుసుకునేందుకు
సమీపంలోని
బ్యాంక్
బ్రాంచ్
కు
వెళ్లొచ్చు
లేదా
[email protected]కి
ఈమెయిల్
పంపి
సమాచారాన్ని
పొందవచ్చు.

మీ
రుణ
చెల్లింపులు
లేదా
ఇతర
సహాయం
కోసం
పాత
ఆఫీసులు
అందుబాటులోనే
ఉంటాయని
గుర్తుంచుకోండి.
తాజా
విలీనం
వల్ల
చెల్లించే
ఈఎంఐలలో
ఎలాంటి
మార్పులు
ఉండవు.
అలాగే
పన్ను
రాయితీలను
పొందటం
కోసం
కస్టమర్లు
లోన్‌పై
వడ్డీ
సర్టిఫికేట్‌ను
వెబ్‌సైట్‌లో
కస్టమర్
లాగిన్
పోర్టల్
నుంచి
డౌన్‌లోడ్
చేసుకోవచ్చు.

మెుదటి
సారి
లోన్
పొందిన
తర్వాత
12
నెలలు
చెల్లింపులు
చేశాక..
టాప్
అప్
లోన్
కోసం
దరఖాస్తు
చేసుకోవచ్చు.
వెబ్‌సైట్‌లో
ఆన్‌లైన్‌లో
లేదా
హెల్ప్‌లైన్‌కు
కాల్
చేయడం
ద్వారా
లేదా
సమీపంలోని
HDFC
బ్యాంక్
హోమ్
లోన్
సర్వీసింగ్
బ్రాంచ్‌ని
సందర్శించటం
ద్వారా

ప్రక్రియను
పూర్తి
చేయవచ్చు.
ఎలాంటి
సందేహాలు
వచ్చినా
కస్టమర్లు
కస్టమర్
కేర్
ద్వారా
సలహాలను
పొందవచ్చు.

English summary

Questions and doubts to HDFC home loan customers with merger and answers for them

Questions and doubts to HDFC home loan customers with merger and answers for them.

Story first published: Sunday, July 2, 2023, 9:38 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *