Heart Attack : హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలివే..

[ad_1]

గుండె పనిచేయడం ఆగిపోయినప్పుడు ఇది కొన్ని లక్షణాలను సూచిస్తుంది. ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండి డాక్టర్‌కి చూపించడం మంచిది.

లక్షణాలు..

గుండె జబ్బులకి సంబంధించిన లక్షణాలు ఇతర వ్యాధులలానే ఉన్నాయి. అందువల్ల రోగ నిర్ధారణ, ట్రీట్‌మెంట్ ఆలస్యమవుతుంది. లక్షణాల తీవ్రత కారణంగా ట్రీట్‌మెంట్ చేస్తారు. గుండెపోటు వచ్చినప్పుడు ఏయే లక్షణాలు వస్తాయంటే..

  • చాలా మందికి ఛాతీ నొప్పి, అజీర్ణం ఉంటుంది.
  • గుండెపోటుతో సంబంధం ఉన్న ఛాతీ నొప్పిని గుర్తించడం కష్టం.
  • ప్రజలు అజీర్ణ సమస్య కోసం ట్రీట్‌మెంట్‌ని ఆలస్యం చేస్తుంది. ఇది గుండెపోటుకి సంబంధించిన నొప్పి.

Also Read : వీటిని తింటే స్పెర్మ్ కౌంట్ తగ్గి పిల్లలు పుట్టరట..

ఎడమ భుజంలో నొప్పి..

గుండెపోటు కారణంగా చాలా మందికి నొప్పి, ఛాతీలో ఇబ్బందిగా ఉంటుంది. లైఫ్‌స్టైల్ సరిగ్గా లేకపోవడం, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, ఎక్కువసేపు కూర్చోవడం, ఒకేచోట కూర్చోవడం వంటివి కూడా భుజం నొప్పికి కారణమవుతాయి.

కడుపులో నొప్పి..

చాలా మంది గ్యాస్ట్రిక్, అసిడిటీ వల్ల కడుపు నొప్పి వస్తుందని అనుకుంటారు. కడుపు మధ్య భాగంలో మంట, నొప్పి గుండె జబ్బులకి కారణమవుతుంది.

తలతిరగడం..

మన శరీరం అలసిపోయి కళ్ళు తిరగడం, కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం జరుగుతుంది. ఇవన్నీ నిశ్శబ్ధ లక్షణాలు. సాధారణంగా వికారం, వాంతులు కూడా ఉంటాయి.

గుండె ఆరోగ్యానికి చిట్కాలు..

ఈ సింపుల్ చిట్కాలతో హృదయం పదిలం .. గుండె జబ్బులు దూరం

చల్లని చెమటలు..

కొన్నిసార్లు గుండె పోటు వస్తే చెమటలు కూడా వస్తాయి. ఎక్కువగా ఆడవారిలో ఈ సమస్యలు వస్తాయి. వీటిని పట్టించుకోం.
కానీ, దీనిని గుండె సంబంధిత సమస్యగా అనుకోవచ్చు. గుండెపోటు సమయంలో, మన శరీరం రక్తాన్ని పంప్ చేయడానికి గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. దీని వల్ల చెమటలు పడతాయి.

Also Read : Piles Problems : పైల్స్ ఉన్నవారు వీటిని అస్సలు తీసుకోకూడదు..

అయితే, కేవలం నొప్పిని బట్టి గుండెపోటుని గుర్తించడం కష్టమే. కానీ, వీటిని అసలు నిర్లక్ష్యం చేయొద్దు. సమస్య ఎక్కువగా ఉంటే అంబులెన్స్‌కి ఫోన్ చేయాలి.

డాక్టర్స్ ఏం చెబుతున్నారంటే..

గుండె సంబంధిత సమస్యలకి దూరంగా ఉండడం అంటే హెల్దీ ఫుడ్‌తో పాటు చెడు అలవాట్లకి దూరంగా ఉండడం, రోజువారీ వర్కౌట్, యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి చేస్తే ఒత్తిడిని తగ్గిస్తుంది.

Dr. Sharad Kulkarni
BAMS, MS
Jeevottama Health – Ayurveda Clinic, Bengaluru

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Read More : Health News and Telugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *