[ad_1]
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆర్టరీస్‌లో కొవ్వు నిల్వలు పెరగడం వల్ల లోయర్ బాడీ, కాళ్ళకు రక్తప్రసరణ తగ్గుతుంది. దీని కారణంగా పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అనే సమస్య వస్తుంది. ఇది చాలా ఇబ్బందిగా మారుతుంది.
Also Read : Vitamin D Deficiency : చలికాలంలో విటమిన్ డిని ఎలా పొందాలంటే..
గ్లోబార్ నుండి డాక్టర్ జోసెఫ్ అంబానీ Express.co.uk తో మాట్లాడారు. ఆయన ప్రకారం, పాదాలు చల్లగా, తిమ్మిరిగా అనిపిస్తే హై కొలెస్ట్రాల్ ఉన్నట్లే.
పాదాలను చూసి హై కొలెస్ట్రాల్ గురించి తెలుసుకోవచ్చు.
సీజన్‌తో సంబంధం లేకుండా చలిగా ఉంటే.. కాస్తా ఆలోచించాలి. అయితే పాదాలు చల్లగా ఉండడం, తిమ్మిరిగా అనిపించినప్పుడు సమస్య ఉన్నట్లే. అది రెండు కాళ్ళకి ఉండాల్సిన అవసరం లేదు. ఒక్క కాలులో కూడా ఈ సమస్య ఉంటుంది. ఇలాంటి సమస్య ఎదురైతే వెంటనే డాక్టర్‌ని కలిసి చెక్ చేయించుకోవాలని డాక్టర్ జోసెఫ్ చెబుతున్నారు.
మాయో క్లినిక్ ప్రకారం..
పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ శరీరంలో కొవ్వు నిల్వల కారణంగా ధమనులు ఇరుకైనప్పుడు వస్తుంది. ఇది చేతులు, కాళ్ళకి రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఆరోగ్య శరీరం ప్రకారం, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ కారణంగా కాళ్ళు, చేతులుకి అనుగుణంగా తగినంత రక్తప్రవాహాన్ని పొందవు. ఇది నడిచేటప్పుడు కాలు నొప్పికి కారణం కావొచ్చు.
లక్షణాలు ఏంటంటే..
పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ ఇతర లక్షణాలు, కాలు తిమ్మిరి, బలహీనత, పాదాలలో బలం లేకపోవడం, బలహీనంగా అనిపించడం కాళ్ళ చర్మ రంగు మార్పులు, గోర్లు పెరగకపోవడం, కాళ్ళపై పుండ్లు, ఏవైనా పనులు చేస్తున్నప్పుడు నొప్పి, తిమ్మిరి వంటివి ఉంటాయి. నొప్పి కూడా ఉంటుంది.
Also Read : Hemoglobin : ఈ జ్యూస్ తాగితే రక్తం పెరుగుతుందట..
ఎన్నో కారణాలు హై కొలెస్ట్రాల్‌కి కారణం కావొచ్చు. సరైన లైఫ్‌స్టైల్ లేకపోవడం. సరైన ఫుడ్ తీసుకోకపోవడం, వర్కౌట్ చేయకుండా ఉండడం ఇలాంటివన్నీ కూడా కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతాయి. కాబట్టి వీటన్నింటిని సరి చేసుకోవాలి.
ప్రాసెస్డ్, జంక్ ఫుడ్ బదులు ఆకుపచ్చ కూరగాయలు, హెల్దీ, హైడ్రేటింగ్ ఫ్రూట్స్, ఫైబర్ రిచ్ ఫుడ్స్ మొదలైనవాటిని తీసుకోండి.
రెగ్యులర్‌గా నడవడంతో పాటు మంచి వర్కౌట్ చేయండి.
ధూమపానానికి దూరంగా ఉండడంతో పాటు మద్యపానాన్ని పూర్తిగా తగ్గించాలి. అదే విధంగా సమస్య ఏమైనా ఉందా అనేది తెలుసుకోవడానికి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చాలా అవసరం.
కొంతమంది వ్యక్తుల్లో పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. తినే ఆహారంలోనూ.. సాల్మన్ వంటి చేపలు, బ్రౌన్ రైస్, ఫైబర్ ఫుడ్ తినాలి. వీటితో పాటు సీజనల్ ఫ్రూట్స్, కూరగాయలు తీసుకోవాలి.
పెరుగుతున్న కాలుష్యం, తగ్గుతున్న శారీరక శ్రమ, ఇతర వైరస్‌ల కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు చెప్పకుండానే దాడి చేస్తున్నాయి. వీటి కారణంగా ముందు నుంచే ఎలాంటి సమస్యలు రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అనేక ఆరోగ్య సమస్యలకి మూల కారణం కొవ్వు. ఈ కొవ్వు కారణంగానే గుండె జబ్బులు, బీపీ, షుగర్స్ ఇంకా ఎన్నో సమస్యలు వస్తున్నాయి. కాబట్టి వీటన్నింటికి చెక్ పెట్టాలంటే ప్రతి ఒక్కరూ కూడా తమకు తాముగా తమ శరీరాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలిన కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Also Read : Romance Mistake : వీరంతా ఫస్ట్ నైట్ రోజున ఆ తప్పులు చేశారట..
ఎందుకంటే ఏ సమస్య అయినా రావడానికి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవడం, మొదట్లోని గుర్తించడం వల్ల దానికి పరిష్కారం ఈజీగా తీసుకోవచ్చు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడం, ఇయర్లీ హెల్త్ చెకప్స్ చేయించుకోవాలని చెబుతున్నారు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
- Read More : Relationship News and Telugu News
[ad_2]
Source link
Leave a Reply