[ad_1]
Hormone Replacement Therapy: హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (HRT) అంటే శరీరం సరైన పరిమాణంలో ఉత్పత్తి చేయలేని హార్మోన్లను భర్తీ చేసే వైద్య ప్రక్రియ. ఇది సాధారణంగా హార్మోన్ల అసమతుల్యతతో బాధ పడే వ్యక్తులకు.. వారి లక్షణాల నుంచి ఉపశమనం ఇవ్వడానికి.. ఈ ట్రీట్మెంట్‌ను ఇస్తారు. చాలా కారణాల వల్ల హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (HRT) తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మెనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో వేడి ఆవిర్లు, మూడ్ స్వింగ్‌లు, యోని పొడిబారడం, నిద్ర భంగం వంటి లక్షణాలను తగ్గించడానికి హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ చేస్తారు. మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు క్షీణిస్తూ ఉంటాయి, HRT వీటిని భర్తీ చేసి.. మెనోపాజ్ లక్షణాల నుంచి ఉపశమనం ఇవ్వడానికి సహాయపడుతుంది. HRT ద్వారా లాభాలు, నష్టాలు రెండూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.
[ad_2]
Source link
Leave a Reply