Hyderabad: ఆఫీస్ లీజింగ్‌లో ముందున్న బెంగళూరు, చెన్నై, హైదరాబాద్..

[ad_1]

News

oi-Chekkilla Srinivas

|

ఆఫీస్
లీజింగ్‌లో
59
శాతం
వాటాతో
భారతదేశంలోని
మూడు
ప్రధాన
దక్షిణాది
నగరాలు
బెంగళూరు,
చెన్నై,
హైదరాబాద్

ఆఫీస్
డిమాండ్‌లో
ముందున్నాయి.
‘ది
కనెక్ట్
క్యూ2
2023’
పేరుతో
రియల్
ఎస్టేట్
కన్సల్టెంట్
వెస్టియన్
త్రైమాసిక
ఆఫీస్
మార్కెట్
నివేదిక
ప్రకారం
జూన్‌తో
ముగిసిన
త్రైమాసికంలో
టాప్
7
నగరాలకు
సంబంధించి
ఆఫీస్
లీంజింగ్
వివరాలు
వెల్లడించింది.

క్యాలెండర్
సంవత్సరం
ఏప్రిల్-జూన్
త్రైమాసికంలో
మొత్తం
13.9
మిలియన్
చదరపు
అడుగులలో
మూడు
ప్రధాన
దక్షిణాది
నగరాల్లో
సంయుక్త
ఆఫీసు
లీజింగ్
8.2
మిలియన్
చదరపు
అడుగుల
వద్ద
ఉంది.

ప్రపంచ
అనిశ్చితుల
మధ్య
పెద్ద
దేశీయ
సంస్థలు,
MNCలు
నిర్ణయం
తీసుకోవడంలో
జాప్యం
కారణంగా
ఏడు
ప్రధాన
నగరాల్లో,
ఆఫీస్
లీజింగ్
ఏప్రిల్-జూన్
మధ్య
కాలంలో
14.8
మిలియన్
చదరపు
అడుగుల
నుంచి
6
శాతం
తగ్గి
13.9
మిలియన్
చదరపు
అడుగులకు
పడిపోయింది.
అయితే,
గత
త్రైమాసికంతో
పోలిస్తే
డిమాండ్
17
శాతం
పెరిగింది.
“ప్రపంచవ్యాప్తంగా
ఎదురుగాలి
వీస్తున్నప్పటికీ,
భారత
ఆర్థిక
వ్యవస్థ
మంచి
పనితీరును
కనబరిచింది.
FY23
చివరి
త్రైమాసికంలో
భారతదేశ
GDP
వృద్ధి
రేటు
మెరుగుపడింది.
ఆర్థిక
మార్కెట్లు
కూడా
మంచి
పనితీరును
కనబరిచాయి.
ఇది
దేశంలో
సానుకూల
సెంటిమెంట్‌ను
ప్రతిబింబిస్తుంది”
అని
వెస్టియన్
సీఈవో
శ్రీనివాస్
రావు.

Hyderabad: ఆఫీస్ లీజింగ్‌లో ముందున్న బెంగళూరు, చెన్నై, హైదరా

టెక్నాలజీ
రంగం
లీజింగ్
కార్యకలాపాలలో
ఆధిపత్యం
చెలాయించిందని,
ఇంజినీరింగ్,
తయారీ
తర్వాత,
మార్కెట్
అనిశ్చితి
మధ్య
జాగ్రత్తగా
లీజింగ్
నిర్ణయాల
కారణంగా
ఫ్లెక్సిబుల్
స్పేస్‌లు
కూడా
పట్టు
సాధించాయని
ఆయన
హైలైట్
చేశారు.”గ్లోబల్
మార్కెట్లు
స్థిరంగా
ఉన్నందున,
సంవత్సరం
రెండవ
అర్ధ
భాగంలో
దేశవ్యాప్తంగా
రియల్
ఎస్టేట్
కార్యకలాపాలు
పెరిగే
అవకాశం
ఉంది”
అని
రావు
చెప్పారు.
చెన్నై
లీజు
1.2
మిలియన్
చదరపు
అడుగుల
నుంచి
2.2
మిలియన్
చదరపు
అడుగులకు
83
శాతం
పెరిగింది.

బెంగళూరులో
లీజింగ్
4.2
మిలియన్
చదరపు
అడుగుల
నుంచి
12
శాతం
తగ్గి
3.7
మిలియన్
చదరపు
అడుగులకు
తగ్గింది.
హైదరాబాద్
2.4
మిలియన్
చదరపు
అడుగుల
నుంచి
4
శాతం
తగ్గి
2.3
మిలియన్
చదరపు
అడుగులకు
పడిపోయింది.
మహారాష్ట్రలోని
రెండు
ప్రధాన
కార్యాలయ
మార్కెట్లలో,
ముంబైలో
లీజింగ్
2.4
మిలియన్
చదరపు
అడుగుల
నుండి
1.8
మిలియన్
చదరపు
అడుగులకు
25
శాతం
పడిపోయింది.కానీ
పూణేలో
మాత్రం
డిమాండ్
6
శాతం
పెరిగి
1.7
మిలియన్
చదరపు
అడుగుల
నుంచి
1.8
మిలియన్
చదరపు
అడుగులకు
పెరిగింది.

ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో
ఆఫీస్
లీజింగ్
తగ్గింది.
2.1
మిలియన్
చదరపు
అడుగుల
నుండి
5
శాతం
తగ్గి
2
మిలియన్
చదరపు
అడుగులకు
పడిపోయింది.
కోల్‌కతాలో
లీజింగ్
కార్యకలాపాలు
0.8
మిలియన్
చదరపు
అడుగుల
నుండి
0.1
మిలియన్
చదరపు
అడుగులకు
88
శాతం
పడిపోయాయి.
అగ్ర
నగరాల్లో
ఆఫీస్
లీజింగ్
27.1
మిలియన్
చదరపు
అడుగుల
నుంచి
5
శాతం
తగ్గి
25.8
మిలియన్
చదరపు
అడుగులకు
పడిపోయింది.
దక్షిణాది
ఆధిపత్యం
జనవరి-జూన్
కాలంలో
కూడా
కనిపించింది,
మూడు
దక్షిణ
భారత
నగరాల
వాటా
57
శాతంగా
ఉంది.

English summary

Bengaluru, Chennai and Hyderabad lead with 59 percent share in office leasing

India’s three major southern cities – Bengaluru, Chennai and Hyderabad – lead office demand with a 59 percent share of office leasing. According to real estate consultant Westian’s quarterly office market report titled ‘The Connect Q2 2023’, office leasing details for the top 7 cities for the quarter ended June have been revealed.

Story first published: Saturday, July 22, 2023, 14:43 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *