Hyderabad: తెలంగాణలో లులూ గ్రూప్ భారీ పెట్టుబడి.. మంత్రి KTR కృతజ్ఞతలు..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


KTR
News:

యూఏఈకి
చెందిన
లులూ
గ్రూప్
తెలంగాణలో
భారీ
పెట్టుబడులు
పెట్టాలని
నిర్ణయించింది.
దీనికి
సంబంధించిన
వివరాలను
పరిశ్రమల
శాఖ
మంత్రి
కేటీఆర్
సమక్షంలో
వెల్లడించింది.

ప్రధానంగా
కంపెనీ
ఫుడ్
ప్రాసెసింగ్,
లాజిస్టిక్స్,
రిటైల్
అవుట్‌లెట్లలో
రూ.3,500
కోట్లను
ఇన్వెస్ట్
చేయనున్నట్లు
తెలిపింది.

క్రమంలో
పండ్లు,
కూరగాయలు,
పప్పులు,
మసాలా
దినుసులను
ప్రాసెస్
చేయడానికి
అత్యాధునిక
ఎగుమతి
ప్రాసెసింగ్
ప్లాంట్‌ను
తెలంగాణలో
ఏర్పాటు
చేయాలని
ఇప్పటికే
నిర్ణయించినట్లు
గ్రూప్
చైర్మన్,
మేనేజింగ్
డైరెక్టర్
ఎంఎ
యూసఫ్
అలీ
వెల్లడించారు.

Hyderabad: తెలంగాణలో లులూ గ్రూప్ భారీ పెట్టుబడి.. మంత్రి KTR

ఆహార
ఉత్పత్తులను
అంతర్జాతీయ
ప్రమాణాలకు
అనుగుణంగా
ప్రాసెస్
చేసి
వాటి
విలువను
పెంచేందుకు
అత్యాధునిక
వసతులను
లులూ
గ్రూప్
ఏర్పాటు
చేస్తోంది.
అలాగే
హైదరాబాద్
నగరంలో
లాజిస్టిక్స్
హబ్‌ను
కూడా
ఏర్పాటు
చేయనుంది.
తెలంగాణలోని
అవకాశాలను
అందిపుచ్చుకునే
క్రమంలో
చేపల
ప్రాసెసింగ్
యూనిట్‌ను
ఏర్పాటు
చేయనున్నట్లు
యూసఫ్
అలీ
వెల్లడించారు.
అలాగే
ఇక్కడి
బియ్యాన్ని
ఎగుమతి
చేసే
ఆలోచనలో
ఉన్నట్లు
తెలుస్తోంది.

ముఖ్యంగా
భారతదేశంలో
తెలంగాణ
వేగంగా
సాధించిన
అభివృద్ధి,
విజయాలు
తనను
ఆకట్టుకున్నాయని
లులూ
గ్రూప్
ఛైర్మన్
వెల్లడించారు.
బీఆర్ఎస్
ప్రభుత్వం
భూమి
కేటాయించిన
వెంటనే
పనులు
ప్రారభిస్తామని
స్పష్టం
చేశారు.
చెంగిచెర్ల
దగ్గర
రూ.200
కోట్ల
పెట్టుబడితో
రోజుకు
60
టన్నుల
మాంసాన్ని
ప్రాసెసింగ్
చేసే
ఎక్స్‌పోర్ట్
ప్లాంట్
ఏర్పాటు
చేయనున్నట్లు
తెలిపారు.
రానున్న
18
నెలల్లో
ఇది
వాణిజ్య
కార్యకలాపాలను
ప్రారంభిస్తుందని
వెల్లడించారు.

దీనికి
ముందు
దావోస్
ప్రపంచ
ఆర్థిక
సదస్సులో
రూ.500
కోట్ల
మేర
పెట్టుబడి
పెట్టాలని
కంపెనీ
నిర్ణయించినప్పటికీ..
దానికి
ఏడింతల
పెట్టుబడితో
నేడు
తెలంగాణలో
అడుగుపెట్టినట్లు
మంత్రి
కేటీఆర్
వెల్లడించారు.
లులూ
గ్రూప్
మెుదటి
ప్రాజెక్టులో
భాగంగా
5
లక్షల
చదరపు
అడుగుల
విస్తీర్ణంలో
మంజీరా
మాల్‌గా
పిలవబడే
మాల్‌ను
లులూ
మాల్‌గా
మార్చాలని
కంపెనీ
నిర్ణయించింది.
దీనిని
సెప్టెంబరు
మెుదటి
వారంలో
ప్రారంభానికి
సిద్ధంగా
ఉన్నట్లు
యాజమాన్యం
వెల్లడించింది.

లులూ
మాల్‌తో
పాటు
మరో
మూడు
మాల్స్‌ను
గ్రూప్‌
ప్రతిపాదిస్తోంది.
ఇందులో
హైదరాబాద్‌లో
రూ.2,000
కోట్లతో
డెస్టినేషన్
షాపింగ్
మాల్,
నగరం
శివార్లలోని
మినీ
మాల్స్,
రాష్ట్రంలోని
ఇతర
ప్రధాన
నగరాలు,
పట్టణాలు
ఉన్నాయి.
రెండు
నెలల్లో

మాల్స్‌కు
భూమిని
గుర్తిస్తామని..
అక్కడి
నుంచి
మాల్స్
ప్రారంభించేందుకు
18-24
నెలల
సమయం
పడుతుందని
చెప్పారు.

English summary

UAE based Lulu group announced 3500 crores investment in hyderabad and Telangana

UAE based Lulu group announced 3500 crores investment in hyderabad and Telangana

Story first published: Monday, June 26, 2023, 15:21 [IST]



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *