hydrogen tain: ఈ రైళ్లు ప్రవేశపెట్టనున్న రెండో దేశంగా భారత్.. మొదటి సవారీ ఎప్పుడంటే?

[ad_1]

గ్రీన్ ఎనర్జీకి పెద్దపీట:

గ్రీన్ ఎనర్జీకి పెద్దపీట:

గ్రీన్ ఎనర్జీపై ఈ బడ్జెట్‌ ప్రత్యేక దృష్టి పెట్టిందని అశ్విని వైష్ణవ్ అన్నారు. అందులో భాగంగా హైడ్రోజన్ రైలు తయారు చేసేందుకు నిర్ణయించామన్నారు. మొదటగా కల్కా-సిమ్లా వంటి వారసత్వ ప్రాముఖ్యత ఉన్న రూట్ లో దీనిని ప్రవేశపెట్టి, క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని తెలిపారు. గురుకృపా వంటి కొత్త రూట్లను ఈ జాబితాలో చేర్చడం ద్వారా దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చూపించాలనే ప్రధాని మోడీ ఆశయం కూడా నెరవేర్చినట్లవుతుందని వెల్లడించారు.

దేశానికి గ్రోత్ ఇంజిన్:

దేశానికి గ్రోత్ ఇంజిన్:

పూర్తిగా స్వదేశంలోనే రూపొందించి, ఇక్కడే హైడ్రోజన్ రైలు తయారు చేస్తామని రైల్వే మంత్రి చెప్పారు. ఉత్తర రైల్వే వర్క్‌షాప్‌లో హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైలు నమూనాను అభివృద్ధి చేస్తున్నామని గత నెలలోనే ఆయన ప్రకటించారు. అనంతరం హర్యానాలోని సోనిపట్-జింద్ సెక్షన్‌లో పరీక్షిస్తామన్నారు. 2023 బడ్జెట్‌ దేశానికి గ్రోత్ ఇంజిన్‌లా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సారి రైల్వేల కోసం కేటాయించిన 2.41 లక్షల కోట్లతో ప్రయాణీకుల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా పెద్ద మార్పులు తెస్తామని ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని చోట్ల వందేభారత్ రైళ్ల తయారీ:

మరిన్ని చోట్ల వందేభారత్ రైళ్ల తయారీ:

రైల్వేల అభివృద్ధిని ప్రస్తావిస్తూ.. ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకం కింద 1,275 స్టేషన్లను తిరిగి అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. చెన్నలో మాత్రమే కాకుండా హర్యానాలోని సోనిపట్, మహారాష్ట్రలోని లాతూర్‌ లోనూ వందేభారత్ రైళ్లు తయారు చేయనున్నట్లు చెప్పారు. 2014కి ముందు ప్రతిరోజూ కేవలం 3 కి.మీ ట్రాక్ మాత్రమే వేసేవారని.. ప్రస్తుతం 12 కి.మీ కు పెంచామని చెప్పారు. వచ్చే ఏడాది నాటికి రోజుకి 16 కి.మీ ట్రాక్‌ వేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *