IIFL NCD’s: 9% వడ్డీ అందిస్తున్న ఐఐఎఫ్ఎల్.. పెట్టుబడి అవకాశం గురించి ఇప్పుడు తెలుసుకోండి..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

IIFL NCD’s: మనలో చాలా మందికి NCD అంటే పరిచయం లేకపోవచ్చు. వీటిని నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు అని పిలుస్తారు. ఇవి డెట్ పెట్టుబడి మార్గాల్లో ఒకటి. బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్ల కంటే వీటికి వడ్డీ అధికంగా లభిస్తుంది కూడా. అయితే ప్రస్తుతం ఐఐఎఫ్ఎల్ సెక్యూర్డ్ డిబెంచర్లను విడుదల చేస్తోంది. వీటిని కొనుగోలు చేయటం ద్వారా పెట్టుబడిదారులకు లభించే 8 ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

లిక్విడిటీ..

ఎన్సీడీలను స్టాక్ మార్కెట్లలో కూడా లిస్ట్ చేస్తారు. అందువల్ల ఎప్పుడైనా విక్రయించుకునేందుకు అవకాశం లభిస్తుంది. పైగా వీటిపై లభించే ఆదాయానికి ఎలాంటి టీడీఎస్ కోతలు ఉండవు. అయితే బ్యాంక్ డిపాజిట్ల విషయంలో ఏడాదికి వడ్డీ ఆదాయం రూ.10 వేలకు మించితే టీడీఎస్ తగ్గించబడుతుంది.

IIFL NCD's: 9% వడ్డీ అందిస్తున్న ఐఐఎఫ్ఎల్..

ఇన్వెస్టర్లకు 8 ప్రయోజనాలు..

– పెట్టుబడి పెట్టే వినియోగదారులకు దాదాపుగా 9 శాతం వడ్డీ లభిస్తుంది
– మార్కెట్లో వడ్డీ రేట్లు తగ్గినప్పటికీ రానున్న 2-5 ఏళ్ల కాలంలో ఎన్సీడీ ఇన్వెస్టర్లకు 8.5-9 శాతం వడ్డీ లభిస్తుంది
– వడ్డీ ఆదాయంపై ఎలాంటి టీడీఎస్ ఉండనందున ఫారం-15g, 15h ఫైల్ చేయాల్సిన అవసరం ఉండదు
– సెక్యూర్ చేయబడిని ఐఐఎఫ్ఎల్ ఎన్సీడీలు స్టాక్ మార్కెట్లో జాబితా చేయబడతాయి
– ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు అందిస్తున్న 7.5 శాతం వడ్డీ రేటు కంటే 1.5 శాతం అధిక వడ్డీ ఆదాయం లభిస్తుంది
– కంపెనీ ఆస్తులు గ్యారెంటీగా ఉంచినందున ఇన్వెస్టర్ల డబ్బు సేఫ్ గా ఉంటుంది
– ఐఐఎఫ్ఎల్ కంపెనీ డిబెంచర్లు CRISIL సంస్థ AA రేటింగ్ అందించింది దీని వల్ల ఇన్వెస్టర్ల డబ్బుకు సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది
– కంపెనీకి మంచి వ్యాపారం, బలమైన ఆర్థిక ఫలితాలు ఉన్నందున ఇన్వెస్టర్లకు సేఫ్టీ ఎక్కువ

ఇష్యూ వివరాలు..

ఐఐఎఫ్ఎల్ ఎన్సీడీల సబ్ స్క్రిప్షన్ జనవరి 6, 2023న ఓపెన్ అయింది. ఇది ఈనెల 18న క్లోజ్ అవుతోంది. కంపెనీ ఈ ఇష్యూ ద్వారా రూ.100 కోట్లను సమీకరిస్తోంది. పైగా గ్రీన్ షూ ఆప్షన్ ద్వారా రూ.900 కోట్లను కేటాయించింది. దీంతో మెుత్తం ఇష్యూ సైజ్ రూ.1000 కోట్లుగా ఉంది. ఒక్కో ఎన్సీడీ ఫేస్ వ్యాల్యూ రూ.1,000 గా ఉంది. ఎంత కాలం పెట్టుబడి పెడితే ఎంత సొమ్ము వస్తుంది వంటి పూర్తి వివరాలు టేబుల్ లో ఉన్నాయి.

English summary

IIFL issuing NCD’s with CRISIL AA rating investors get upto 9 percent interest

IIFL issuing NCD’s with CRISIL AA rating investors get upto 9 percent interest..

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *