income tax: కొత్త పన్ను విధానంలో మరో ఉపశమనం.. 7 లక్షల ఆదాయం మించిన వారికి కేంద్రం శుభవార్త

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|

income tax: తాజా బడ్జెట్ సమావేశాల్లో వేతన జీవులకు కేంద్రం ఉపశమనం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆదాయపు పన్ను రాయితీ లిమిట్ ను 5 లక్షల నుంచి 7 లక్షలకు పెంచుతూ మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో 7 లక్షల లోపు సంపాదిస్తున్న వారు ఒక్క రూపాయి కూడా టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదన్న మాట. మరి 7 లక్షల 100 రూపాయల సేలరీ ఉంటే పన్ను కట్టాల్సిందే. సరిగ్గా ఇక్కడే కేంద్ర ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

పరిమితికి ఎగువనున్నది చెల్లిస్తే చాలు:

2023-24 నుంచి కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్నుపై ఉన్న రాయితీ పరిధిని కేంద్ర ఆర్థిక శాఖ 7 లక్షలకు పెంచింది. అయితే ఆ పరిధికి మించి స్వల్పంగా అధిక జీతం పొందుతున్నవారు మాత్రం తీవ్ర నిరాశకు గురయ్యారు.

అయితే 7 లక్షలకు పైగా అతికొద్ది మొత్తం సంపాదిస్తున్న వారు.. ఆపై విలువ చెల్లించేలా నిబంధనల్లో మార్పులు చేశారు. కానీ దీనిపై ఓ నిర్ధిష్ట లిమిట్ ను మాత్రం కేంద్రం ప్రకటించలేదు. ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం రూ.7,27,777 ఆదాయమున్న వ్యక్తులు ఈ ఉపశమంతో ప్రయోజనం పొందనున్నట్లు తెలుస్తోంది.

income tax: కొత్త పన్ను విధానంలో మరో ఉపశమనం..

ఇలా అర్థం చేసుకోవాలి:

ఉదాహరణకు ఓ వ్యక్తి సంవత్సర ఆదాయం 7 లక్షలు అనుకుంటే, ఏప్రిల్ 1 అనంతరం అతడు ఆదాయపు పన్ను పరిధిలోకి రాడు. తద్వారా ప్రభుత్వానికి ఎటువంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ అదే వ్యక్తి ఆదాయం 7 లక్షల 100 అనుకుంటే, అతడు 25 వేలకు పైగా పన్ను కట్టాల్సి వస్తుంది.

అంటే ఆదాయంలో కేవలం 100 పెరగడం వల్ల 25 వేలు అదనంగా వెచ్చించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే తాజా నిబంధన ప్రకారం.. 7 లక్షల 100 జీతం పొందుతున్న వ్యక్తి కేవలం ఆపై 100 ట్యాక్స్ గా చెల్లిస్తే సరిపోతుందన్నమాట.

న్యూ రెజీమ్ కు మార్చేందుకే..

నిన్న పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఫైనాన్స్ బిల్లులో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. మొత్తంగా ఉద్యోగులను పాత పన్ను విధానం నుంచి కొత్త పద్ధతిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

తాజా బడ్జెట్ లో పాత పన్ను విధానంలో ఎటువంటి మార్పులు తీసుకురాకపోగా.. ఓల్డ్ రెజీమ్ లో ఉన్న స్టాండర్డ్ డిడక్షన్‌ను సైతం కొత్త విధానానికీ వర్తింపజేయడమే దీనికి నిదర్శనం. 5 కోట్ల వార్షికాదాయం ఉన్న వారిపైనా పన్నుపోటు తగ్గించి ఇటువైపు ఆకర్షించడానికి మోడీ సర్కారు ప్లాన్ చేసింది.

English summary

Finance Ministry announced additional tax benefits for little above 7 lakhs salaried

Tax benefits announced along with finance bill

Story first published: Saturday, March 25, 2023, 11:25 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *