[ad_1]
|
చివరి బడ్జెట్ ముందు..
2024లో ఎన్నికలు ఉన్నందున ఇదే చివరి పూర్తి వార్షిక బడ్జెట్ కాబట్టి.. గత బడ్జెట్ సమయంలో ప్రభుత్వం ప్రకటించిన ఒక హామీని తాజాగా నెరవేర్చింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను చట్టం- 1961లో కొత్త సెక్షన్ 194Pని చేర్చింది. దీనికి తోడు రూల్- 31, రూల్- 31ఎ, ఫారం- 16, 24క్యూలలో అవసరమైన సవరణలు చేసినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.
ఎవరికి ప్రయోజనం..
2022 బడ్జెట్‌లో ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు నుంచి వృద్ధులకు ప్రభుత్వం పెద్ద ఉపశమనాన్ని ప్రకటించింది. తాజాగా దానికి అనుగుణంగా చట్టాల్లో మార్పులు తెచ్చింది. ఈ మార్పుల ప్రకారం.. దేశంలో 75 ఏళ్లు పైబడిన వారు ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయాల్సిన అవసరం లేదు.
షరతులకు లోబడి..
ఆర్థిక మంత్రిత్వ శాఖ ఐటీఆర్ ఫైలింగ్ విషయంలో ఇచ్చిన వెసులుబాటు అర్హులకు మాత్రమే. అదేంటంటే.. ప్రభుత్వ ప్రకటన ప్రకారం బ్యాంకు నుంచి పెన్షన్ లేదా వడ్డీని మాత్రమే ఆదాయ వనరుగా కలిగి ఉన్న సీనియర్ సిటిజన్లు దీని కింద ప్రయోజనం పొందుతారు. వారు ఈ ఏడాది నుంచి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు. ఇదిలా ఉండగా చాలా మంది 2023లో కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో రూ.5 లక్షల వరకు ఎలాంటి టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేకుండా టాక్స్ శ్లాబ్ ను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో కీలక ప్రకటన గురించి వారు వేచిచూస్తున్నారు.
[ad_2]
Source link
Leave a Reply