[ad_1]
జీడీపీ అంచనాలు..
ఫిబ్రవరిలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో క్యాపిటల్ వ్యయాలను గణనీయంగా పెంచటం మంచి పరిణామమని మూడీస్ వెల్లడించింది. దీనికి తోడు స్థితిస్థాపకమైన ఆర్థిక ఊపందుకోవటాన్ని అంచనాల పెంపునకు కాణంగా తెలిపింది. 2023-24లో జీడీపీలో 3.3 శాతం అంటే రూ.10 లక్షల ట్రిలియన్ల క్యాపెక్స్ ఉంటుందని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఆర్‌బీఐ తన బులెటిన్‌ను సమర్థవంతంగా అమలు చేస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో భారత వాస్తవ జీడీపీ వృద్ధిని 7 శాతానికి చేరువ చేయగలదని పేర్కొంది.
ఉద్యోగాల కల్పన..
కేంద్ర బడ్జెట్ మూలధన వ్యయాలపై దృష్టి సారించటం వల్ల ప్రైవేట్ పెట్టుబడులతో పాటు ఉద్యోగాల కల్పన, డిమాండ్ ను బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత బృందం ఒక కథనంలో పేర్కొంది. ఫిబ్రవరి అప్‌డేట్‌లో అమెరికా, కెనడా, యూరో ప్రాంతం, భారత్, రష్యా, మెక్సికో, టర్కీయేతో సహా అనేక G20 ఆర్థిక వ్యవస్థల కోసం మూడీస్ బేస్‌లైన్ 2023 వాస్తవ వృద్ధి అంచనాలను పెంచింది.
గ్రోయింగ్ మార్కెట్..
ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆర్థిక వ్యవస్థ ఊపందుకోవటంతో వీటిలో ఇండియా కూడా ఉండటం మరింత స్థితిస్థాపకంగా నిరూపించబడిందని మూడీస్ పేర్కొంది. గత సంవత్సరం ఆర్థిక వాతావరణం ఊహించినదానికంటే బిగుతుగా ఉందని అభిప్రాయపడింది.
డిసెంబర్ త్రైమాసికంలో..
నిన్న డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన జీడీపీ గణాంకాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ వృద్ధి రేటు కేవలం 4.4 శాతంగా ఉన్నట్లు వెల్లడైంది. అధిక ద్రవ్యోల్బణం కారణంగా చేపట్టిన మానిటరీ చర్యల కారణంగా మార్కెట్లో లిక్విడిటీ తగ్గింది. దీనికి తోడు అధిక ద్రవ్యోల్బణం, తక్కువ వినియోగం కారణంగా వృద్ధి రేటు మందగించిందని నిపుణులు చెబుతున్నారు.
[ad_2]
Source link
Leave a Reply