Infosys: అందనంత ఎత్తుకు ఇన్ఫోసిస్.. సలీల్ పరేఖ్ దిశానిర్ధేశంలో ఐటీ కింగ్ ప్రస్థానం..

[ad_1]

ఐటీ కీలక పాత్ర..

ఐటీ కీలక పాత్ర..

ప్రపంచ ఐటీ రంగంలో భారత పాత్ర.. భారత ఐటీ రంగంలో ఇన్ఫోసిస్ పాత్ర చాలా కీలకమైనవి. ఈ క్రమంలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణపు మైలురాయిని చేరుకుంది. ఇది భారతదేశపు మెుదటి స్టార్టప్ అని చెప్పుకోవచ్చు. దీనిని ఎన్ ఆర్ నారాయణ మూర్తి, నందన్ నీలేకనితో సహా ఏడుగురు వ్యక్తులు సంయుక్తంగా 1981లో స్థాపించారు. నారాయణమూర్తి తనవాటా పెట్టుబడి కోసం భార్య నుంచి రూ.10,000 అప్పుగా తీసుకోవటంతో భాగస్వామిగా మారారు.

లక్షల కోట్ల కంపెనీ..

లక్షల కోట్ల కంపెనీ..

మార్చి 2022 నాటికి ఇన్ఫోసిస్ విలువ రూ.6.65 లక్షల కోట్లుగా ఉంది. ఈ క్రమంలో కంపెనీ ఆదాయం రూ.16.3 బిలియన్లుగా నమోదు చేసింది. కంపెనీ వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలకు విస్తరించగా.. 3,45,000 మందికి ఉపాధిని అందిస్తోంది. అలాగే కంపెనీ అమెరికా స్టాక్ మార్కెట్ నాస్‌డాక్‌లో 1999లో జాబితా చేయబడిన తొలి భారతీయ కంపెనీగా రికార్డును సృష్టించింది. 2021లో 100 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ మార్క్‌ను దాటిన రెండవ భారతీయ సాంకేతిక సంస్థ కావటం విశేషం. అలా కంపెనీ తన ప్రస్థానంలో అనేక మైలురాళ్లను నమోదు చేసింది.

కంపెనీ వివాదాలు..

కంపెనీ వివాదాలు..

2014లో విశాల్ సిక్కాను కంపెనీకి మొదటి బయటి సీఈవోగా నియమించిన తర్వాత ఇన్ఫోసిస్ తీవ్ర వివాదానికి గురైంది. కానీ ప్రస్తుతం కంపెనీ సీఈవోగా ఉన్న సలీల్ పరేఖ్ సీఈవోగా 2018లో రావటంతో కంపెనీ కొంత పుంతలు తొక్కుతూ వేగంగా వృద్ధి బాటలో నడుస్తోంది. కంపెనీ వృద్ధి ఏకంగా నాలుగు రెట్లు పెరగటంలో ఆయన కృషి కలకమైనది. పరేఖ్ కింద స్థిరమైన కరెన్సీలో FY22లో 19.7% రాబడి వృద్ధిని సాధించింది.

పోటీ ప్రపంచంలో..

పోటీ ప్రపంచంలో..

కంపెనీ డిజిటల్ రాబడి పరేఖ్ నేతృత్వంలో 25.5% నుంచి 58.5%నికి పెరిగింది. క్లౌడ్ ఆధారిత సేవలు, ఆటోమేషన్‌ సాంకేతికతలను అందిపుచ్చుకోవటం తీవ్రమైన పోటీ మధ్య ఇన్ఫోసిస్ నిలబడటానికి సహాయపడింది. కానీ పరేఖ్ పదవీకాలంలో ఉన్న ఏకైక ప్రతికూలత నిర్వహణ మార్జిన్‌లో తగ్గుదల మాత్రమే. అయితే కంపెనీ లాభదాయకత కంటే వృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందనటానికి ఇది సరైన సాక్ష్యంగా నిలుస్తోంది. వీటన్నింటి మధ్య నాలుగు దశాబ్ధాల కంపెనీ చరిత్రలో సహ వ్యవస్థాపకుడు NR నారాయణ మూర్తి తర్వాత కంపెనీకి పరేఖ్ రెండవ ఉత్తమ CEO అని వెల్లడైంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *