Infosys Shares: కుప్పకూలిన ఇన్ఫోసిస్ స్టాక్.. రూ.57,000 కోట్లు గల్లంతు.. ఎందుకంటే..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Infosys
Shares:
మార్కెట్
వాటా
పరంగా
దేశంలో
రెండవ
అతిపెద్ద
టెక్
సంస్థ
ఇన్ఫోసిస్.
తాజాగా

సంస్థ
తన
తొలి
త్రైమాసిక
ఆర్థిక
ఫలితాలను
మార్కెట్లోకి
విడుదల
చేసింది.


క్రమంలో
కంపెనీ
తన
FY24
ఆదాయ
మార్గదర్శకాలను
సగానికి
తగ్గించిన
తర్వాత
శుక్రవారం
ట్రేడింగ్
సెషన్‌లో
పెద్దఎత్తున
అమ్మకాల
ఒత్తిడి
షేర్లలో
నెలకొంది.
ప్రారంభ
గంటలో
ఇన్ఫోసిస్
షేర్
ధర
BSEలో
9.5%
మేర
క్షీణించింది.
ఇదే
క్రమంలో
వాల్
స్ట్రీట్‌లో
ఇన్ఫోసిస్
అమెరికన్
డిపాజిటరీ
రిసీట్స్(ADR)
మూడు
నెలల్లో
అతిపెద్ద
సింగిల్-డే
పతనాన్ని
నమోదు
చేశాయి.

Infosys Shares: కుప్పకూలిన ఇన్ఫోసిస్ స్టాక్.. రూ.57,000 కోట్

ఉదయం
10.37
గంటల
సమయంలో
ఇన్ఫోసిస్
స్టాక్
బీఎస్ఈలో
స్టాక్
7.78
శాతం
అంటే
రూ.112.60
క్షీణించి
రూ.1,336.25
వద్ద
ట్రేడింగ్
కొనసాగిస్తోంది.
ఇంట్రాడేలో
స్టాక్
కనిష్ఠంగా
రూ.1,311.60ని
చేరుకుంది.
నేడు
ప్రారంభ
డీల్స్‌లో
ఇన్ఫోసిస్
మార్కెట్
క్యాప్
దాదాపు
రూ.56,943.2
కోట్ల
మేర
ఆవిరైంది.
అంతకుముందు
సెషన్
రూ.6,01,300.62
కోట్లతో
పోలిస్తే
ఇంట్రాడేలో
కనిష్ఠ
స్థాయి
మార్కెట్
క్యాప్
రూ.5,44,357.45
కోట్లుగా
నమోదైంది.

జూన్
తో
ముగిసిన
త్రైమాసికంలో
ఇన్ఫోసిస్
నికర
లాభం
రూ.5,945
కోట్లుగా
నమోదు
చేసింది.
ఇది
సంవత్సరానికి
10.9%
వృద్ధిని
నమోదు
చేసింది.
అయితే
QoQ
ప్రాతిపధికన
3%
క్షీణతను
నమోదు
చేసింది.
అలాగే
కార్యకలాపాల
ద్వారా
వచ్చే
ఆదాయం
Q1లో
రూ.37,933
కోట్లుగా
నిలిచింది.
ఇన్ఫోసిస్
Q1
రాబడి
అంచనాలకు
అనుగుణంగా
ఉంది
కానీ
నికర
ఆదాయం
మిస్
అయింది.

English summary

Infosys stocks in free fall with selling vanished 57,000 crores investors wealth

Infosys stocks in free fall with selling vanished 57,000 crores investors wealth

Story first published: Friday, July 21, 2023, 11:09 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *