Investment: 2023లో తళుక్కున మెరవనున్న రంగం.. బ్రోకరేజ్ ఎంపిక చేసిన స్టాక్స్ ఇవే..!

[ad_1]

 వాణిజ్య ఒప్పందం..

వాణిజ్య ఒప్పందం..

ఆస్ట్రేలియాతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఇది ఇరుపక్షాల వ్యాపారాన్ని మెరుగుపరుస్తుంది. పైగా దేశీయ వస్త్ర పరిశ్రమలోని ఎగుమతిదారులకు ప్రత్యేకంగా ప్రోత్సాహకరంగా ఉండనుంది. ఇది చాలా టెక్స్‌టైల్ కంపెనీలకు నిజంగా పెద్ద వ్యాపార అవకాశం. అలాగే ఈ రంగంలో పెట్టుబడులు పెట్టిన చాలా మంది ఇన్వెస్టర్లకు మంచి రాబడులు రావచ్చని తెలుస్తోంది.

పెరగనున్న డిమాండ్..

పెరగనున్న డిమాండ్..

ప్రోత్సాహకాలకు తోడు 2023లో ఈ రంగంలో డిమాండ్ కూడా భారీగానే పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనివల్ల కేవలం భారత మార్కెట్‌లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లోనూ డిమాండ్‌ పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం టెక్స్‌టైల్ కంపెనీల మూలధన వ్యయం తగ్గటం.. కంపెనీల వృద్ధిని మరింత ప్రోత్సహించగా నిలుస్తుందని అంటున్నారు. ఇది కంపెనీల మార్జిన్లు పెరుగుదలకు దారితీసి కంపెనీల షేర్లు పెరిగేందుకు దోహదపడనుంది.

బ్రోకరేజ్ ఏమందంటే..

బ్రోకరేజ్ ఏమందంటే..

కొన్ని రోజుల కిందట ఎమ్కో గ్లోబల్ సంస్థ టెక్స్‌టైల్ రంగంలోని కొన్ని షేర్లకు BUY రేటింగ్ ఇచ్చింది. అలా ఈ రంగంలోని వర్థమాన్ టెక్స్‌టైల్స్, గోకల్‌దాస్ ఎక్స్‌పోర్ట్స్, నితిన్ స్పిన్నర్స్ సహా కొన్ని స్టాక్‌లను కొనుగోలు చేయాలని సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పీఎల్‌ఐ స్కీమ్ కంపెనీల ఉత్పత్తి పెరగటానికి దోహదపడుతోంది. ఇది కంపెనీల భవిష్యత్తును బంగారంగా మార్చనుంది.

 టార్గెట్ ధర..?

టార్గెట్ ధర..?

వర్థమాన్ టెక్స్‌టైల్ కంపెనీ షేర్లకు BUY రేటింగ్ ఇచ్చిన బ్రోకరేజ్ దానికి రూ.455 టార్గెట్ ధరగా నిర్ణయించింది. ఇది ప్రస్తుతం షేర్ ధర కంటే దాదాపుగా 50 శాతం అధికం అని చెప్పుకోవాలి. అలాగే గోకల్‌దాస్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ టార్గెట్ ధరను రూ.575గా నిర్ణయించింది. ఇది ప్రస్తుతం షేర్ ధర ఉన్న స్థాయి కంటే దాదాపుగా 70 శాతం అధికం. ఇక ఈ రంగంలోని మరో స్టాక్ నితిన్ స్పిన్నర్స్ స్టాక్ ధర రూ.695కు పెరగవచ్చని ఎమ్కో గ్లోబల్ నివేధించింది. అలాగే ఐటీసీ కంపెనీ షేర్లను కొనుగోలు చేయవచ్చని వెల్లడిస్తూ దానికి రూ.630 టార్గెట్ ధరగా నిర్ణయించారు.

 కెన్ బిన్ హోమ్స్..

కెన్ బిన్ హోమ్స్..

దేశీయ బ్రోకరేజ్ ప్రకారం.. మోతీలాల్ ఓస్వాల్ కంపెనీ క్యాన్ బిన్ హోమ్స్ కొనుగోలు చేయవచ్చని సూచించింది. దీనికి టార్గెట్ ధర రూ.630గా నిర్ణయించింది. ప్రస్తుత ధరతో పోలిస్తే ఇది 29% వరకు పెరగవచ్చని అంచనా.

Note: పైన అందించిన వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. వాటి ఆధారంగా ఎలాంటి స్టాక్ మార్కెట్ లావాదేవీలు, పెట్టుబడులు పెట్టకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఇన్వెస్ట్ చేసే ముందు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *