IPO News: ఒక్క రోజే ఛాన్స్.. ఒక్కో షేరుపై రూ.82 లాభం..! పూర్తి వివరాలు..

[ad_1]

Macfos ఐపీవో..

Macfos ఐపీవో..

ఐపీవోలలో ఇన్వెస్ట్ చేసి లాభాలను స్వీకరించి ఇన్వెస్టర్లకు ప్రస్తుతం మంచి అవకాశం అందుబాటులో ఉంది. ఈ లక్కీ ఛాన్స్ రేపటితో ముగియనుంది. ఎందుకంటే మాక్‌ఫోస్ లిమిటెడ్‌ ఐపీవో 21, ఫిబ్రవరి 2023తో ముగియనుంది. ఈ ఐపీవో ఇన్వెస్టర్ల కోసం ఈనెల 17న ప్రారంభమైంది. ఈ స్టాక్ దేశీయ స్టాక్ మార్కెక్ ఎక్స్ఛేంజీల్లో మార్చి 1న లిస్ట్ కావచ్చని తెలుస్తోంది.

సూపర్ GMP..

సూపర్ GMP..

టాప్ బ్రోకరేజీలు అందించిన నివేదిక ప్రకారం Macfos ఐపీవో గ్రేమార్కెట్ ప్రీమియం ఫిబ్రవరి 19న మార్కెట్లో రూ.82 ప్రీమియంతో ఉంది. ఇదే రకమైన పాజిటివ్ ట్రెండ్ కొనసాగితే లిస్టింగ్ సమయానికి జీఎంపీ రూ.184కి చేరవచ్చని బ్రోకరేజ్ అంచనా వేస్తోంది. ఐపీవోలో స్టాక్స్ అలాట్ అయిన ఇన్వెస్టర్లు ఒక్కో షేరుపై 80.39 శాతం లాభాన్ని పొందవచ్చని సమాచారం.

ఐపీవో పూర్తి వివరాలు..

ఐపీవో పూర్తి వివరాలు..

– మాక్‌ఫోస్ ఐపీవో ఫిబ్రవరి 17న ప్రారంభమైంది

– ఐపీవో ఫిబ్రవరి 21న ముగియనుంది

– ఐపీవో ప్రైస్ బ్యాండ్ రూ.96-102గా ఉంది

– Macfos Limited ఐపీవో మార్చి 1న స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కానుంది

– కంపెనీ సబ్ స్క్రైబర్లకు ఫిబ్రవరి 24న షేర్లను అలాట్ చేయవచ్చు

– ఒక్కో లాటులో కంపెనీ రూ.10 ముఖ విలువ కలిగిన 1200 షేర్లను ఉంచింది

– మాక్‌ఫోస్ లిమిటెడ్ ఐపీవో BSE SMEలో జాబితా కానుంది

కంపెనీ వ్యాపారం..

కంపెనీ వ్యాపారం..

మాక్‌ఫోస్ అనేది ప్రధానంగా ఈ-కామర్స్ వ్యాపారంలో ఉన్న కంపెనీ. ఇది తన వ్యాపారాన్ని 2017లో ప్రారంభించింది. కంపెనీ ఎలక్ట్రానిక్ వస్తువులు, రోబోటిక్ విడిభాగాలు, డ్రోన్ల విడిభాగాలు, ఎలక్ట్రానికి స్కూటర్లు భాగాలు, ఐఓటీ అండ్ వైర్ లెస్ వస్తువులతో పాటు మరిన్ని ఉత్పత్తులను విక్రయిస్తుంది. కంపెనీ ఓఎన్జీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, టాటా పవర్, విప్రో ఎంటర్ ప్రైజెస్, భారత్ ఫోర్జ్, టాటా కన్జూమర్ తో పాటు మరికొన్ని ప్రతిష్ఠాత్మక కంపెనీలకు సేవలు అందించింది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *