[ad_1]
News
oi-Mamidi Ayyappa
IPO News: నూతన సంవత్సరం మళ్లీ భారత స్టాక్ మార్కెట్లలో ఐపీవోల రాక చిన్నగా ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు అస్థిరతల్లో కొనసాగుతున్నప్పటికీ.. ప్రముఖ క్రికెటర్ కోహ్లీ మద్దతు కలిగిన కంపెనీ ఐపీవో కోసం మార్కెట్లలోకి రాబోతోంది.
రెగ్యులేటర్ ఆందోళనల తర్వాత విరాట్ కోహ్లి మద్దతు కలిగిన ‘గో డిజిట్ ఇన్సూరెన్స్’ తన ఐపీవోను తీసుకొచ్చేందుకు అవసరమైన పత్రాలను మళ్లీ ఫైల్ చేసింది. ఉద్యోగుల స్టాక్ ప్లాన్ కు సంబంధించి రెగ్యులేటరీ సమస్యలను పరిష్కరించిన తర్వాత ఈ చర్య వచ్చింది. ఈ సంస్థ ఐపీవో ద్వారా 440 మిలియన్ డాలర్లను సమీకరించాలని నిర్ణయించింది.
తాజా ఐపీవోలో 152.1 మిలియన్ డాలర్ల ఫ్రెష్ షేర్ల ఇష్యూ ఉండగా.. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 109.4 మిలియన్ షేర్లను మార్కెట్లో విక్రయించనుందని ప్రాస్పెక్టస్‌లో అందించిన సమాచారం ద్వారా తెలుస్తోంది. దీనికి ముందు తొలిసారిగా గత ఆగస్టులో కంపెనీ ఐపీవోను తీసుకురావటం కోసం ప్రయత్నించింది. జనరల్ ఇన్సూరెన్స్ వ్యాపారంలో ఉన్న డిజిట్ సంస్థకు కెనడా బిలియనీర్ ప్రేమ్ వాట్సాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ గ్రూప్, భారతదేశానికి చెందిన TVS క్యాపిటల్ సపోర్ట్ చేస్తున్నాయి.
ఉద్యోగుల స్టాక్ ప్లాన్‌లకు సంబంధించిన కొన్ని సమ్మతి సమస్యలను సెబీ ప్రైవేట్ లెటర్‌లో లేవనెత్తడంతో ఈ ఏడాది జనవరిలో IPO మరో ఎదురుదెబ్బను ఎదుర్కొంది. ఈ క్రమంలో కంపెనీ మార్చి 27న ప్రత్యేక తీర్మానం ద్వారాఉద్యోగుల స్టాక్ హక్కులను స్టాక్ ఆప్షన్ ప్లాన్‌లకు మార్చింది. సీక్వోయా క్యాపిటల్ ద్వారా చివరిగా 3.5 బిలియన్ డాలర్ల విలువ కలిగిన కంపెనీ.. తన సాల్వెన్సీ రేషియోను నిర్వహించడానికి IPO ఆదాయాన్ని ఉపయోగించాలని యోచిస్తోంది.
English summary
Virat Kohli backed Insurance firm Digit refiles ipo papers with SEBI, Know details
Virat Kohli backed Insurance firm Digit refiles ipo papers with SEBI, Know details
Story first published: Friday, March 31, 2023, 15:00 [IST]
[ad_2]
Source link
Leave a Reply