IPO News: మార్కెట్లలో ఐపీవోల హంగామా.. దూసుకొస్తున్న 7 ఐపీవోలు.. పూర్తి వివరాలు

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

IPO
News:
ఈనెల
రెండవ
అర్థ
భాగంలో
మార్కెట్లోకి
ఐపీవోలు
వరుసగా
క్యూ
కట్టాయి.
దీంతో
ఇన్వెస్టర్లలో
సైతం
కోలాహలం
నెలకొంది.
ఒకటి
కాదు
రెండు
కాదు
ఏకంగా
ఏడు
ఐపీవోలు

వారం
మార్కెట్లలోకి
వస్తున్నాయి.

మెుత్తం
ఏడు
ఐపీవోలలో
మూడు
మెయిన్
బోర్డ్
ఐపీవోలు
ఉండగా..
మరో
నాలుగు
ఎస్ఎమ్ఈ
క్యాటగిరీకి
చెందిన
కంపెనీలు
ఉన్నాయి.
7
ఐపీవోలు
మెుత్తంగా
మార్కెట్ల
నుంచి
రూ.1,600
కోట్లను
సమీకరిస్తున్నాయి.
ఇందులో
ముందుగా
డ్రోన్
తయారీ
కంపెనీ
ఐడియా
ఫోర్జ్
మార్కెట్ల
నుంచి
రూ.567
కోట్లను
సమీకరిస్తోంది.
ఇందుకోసం
ఇష్యూ
ప్రైస్
బ్యాండ్
ధరను
రూ.638-672గా
నిర్ణయించింది.

ఐపీవో
నేటి
నుంచి
సబ్‌స్క్రిప్షన్
కోసం
ఓపెన్
అవుతోంది.

IPO News: మార్కెట్లలో ఐపీవోల హంగామా.. దూసుకొస్తున్న 7 ఐపీవోల

ఇక
ఐటీ
సేవల
సంస్థ
Cyient
DLM
ఐపీవో
రేపు
రిటైల్
ఇన్వెస్టర్లకు
సబ్‌స్క్రిప్షన్
కోసం
అందుబాటులోకి
రానుంది.
కంపెనీ

ఐపీవో
ద్వారా
రూ.592
కోట్లను
సమీకరించాలని
లక్ష్యంగా
పెట్టుకుంది.
దీనికోసం
షేర్ల
ఇష్యూ
ధరను
రూ.250-265గా
నిర్ణయించింది.
ఇదే
క్రమంలో
PKH
వెంచర్స్
ఐపీవో
జూన్
30న
ప్రారంభం
అవుతోంది.
కంపెనీ
దీని
ప్రైస్
బ్యాంక్
ఇంకా
ప్రకటించలేదు.
అయితే
కంపెనీ
మాత్రం
రూ.380
కోట్లను
సమీకరించాలని
నిర్ణయించింది.
షేర్ల
లిస్టింగ్
జూలై
12న
జరుగనుంది.

ఇదే
క్రమంలో
SME
క్యాటగిరీ
నుంచి
మార్కెట్లోకి
వస్తున్న
నాలుగు
ఐపీవోల
వివరాలను
పరిశీలిస్తే..
ముందుగా
కన్వేయర్
బెల్ట్
తయారీ
సంస్థ
పెంటగాన్
రబ్బర్
అడుగుపెడుతోంది.
ఇది
100
శాతం
తాజా
ఇష్యూ
ద్వారా
రూ.16.17
కోట్లను
సమీకరించాలని
నిర్ణయించింది.
ప్లాస్టిక్
బాటిల్
తయారీ
మెషిన్స్
ఉత్పత్తిదారు
గ్లోబల్
పెట్
ఇండస్ట్రీస్
సైతం
ఎస్ఎమ్ఈ
కేటగిరీలో
మార్కెట్లోకి
వస్తోంది.
జూన్
29న
తెరవబడే

ఐపీవో
మార్కెట్ల
నుంచి
రూ.13.23
కోట్లను
సమీకరించాలని
లక్ష్యంగా
పెట్టుకుంది.
దీనికోసం
షేర్
ధరను
రూ.49గా
నిర్ణయించింది.

సాఫ్ట్
వేర్
డెవలప్మెంట్
సర్వీస్
ప్రొవైడర్
Tridhya
Tech
దేశీయ
మార్కెట్ల
నుంచి
26.41
కోట్లను
సమీకరించాలని
నిర్ణయించింది.
దీనికోసం
షేర్
ధర
రూ.35-42గా
నిర్ణయించింది.

మెుత్తాన్ని
రుణాల
చెల్లింపులకు,
కార్పొరేట్
చెల్లింపు
అవసరాలకు
వినియోగించాలని
కంపెనీ
నిర్ణయించింది.
ఇక
చివరగా
మార్కెట్లోకి
అడుగుపెడుతున్న
Synoptics
Technologies
కంపెనీ
ఐటీ
సేవల
రంగంలో
తన
వ్యాపారాన్ని
కొనసాగిస్తోంది.
రూ.54.03
కోట్లను
సమీకరిస్తున్న

కంపెనీ
తన
షేర్
ఇష్యూ
ధరను
రూ.237గా
నిర్ణయించింది.

English summary

From ideaForge to Synoptics Technologies seven ipo’s entering indian markets

From ideaForge to Synoptics Technologies seven ipo’s entering indian markets

Story first published: Monday, June 26, 2023, 11:17 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *