IPPB: పోస్టాఫీస్ ఖాతాదారులకు శుభవార్త.. వాట్సాప్ సేవలు ప్రారంభించిన ఐపీపీబీ..

[ad_1]

News

oi-Chekkilla Srinivas

|

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇండియా పోస్ట మేమెంట్ బ్యాంక్ ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ తో కలిసి బ్యాంకింగ్ సేవలను ప్రారంభించింది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వినియోగదారులు స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్ బ్యాకింగ్ సేవవలు పొందవచ్చు. పలు బ్యాంకు సర్వీసులతోపాటు ఇంటి వద్ద సేవల కోసం వినతి, సమీపంలోని పోస్ట్‌ ఆఫీస్‌ శాఖ ఎక్కడ ఉంది వంటివి వాట్సాప్‌ ద్వారా ఖాతాదారులు తెలుసుకోవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు.

భారత్‌లో డిజిటల్, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌ను ప్రోత్సహించడానికి భారతీ ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం కావడానికి సంతోషిస్తున్నామని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) CGM & CSMO, గురుశరణ్ రాయ్ బన్సాల్ చెప్పారు. డిజిటల్ ఇండియా మిషన్‌లో భాగస్వామిగా దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలను అందించడానికి IPPB చాలా కాలంగా అవిశ్రాంతంగా కృషి చేస్తోందన్నారు.

IPPB: పోస్టాఫీస్ ఖాతాదారులకు శుభవార్త..

సాంకేతికతతో నడిచే ఆర్థిక రంగంలో అపారమైన అశకాశం ఉందని ఎయిర్‌టెల్ ఐక్యూ బిజినెస్ హెడ్ అభిషేక్ బిస్వాల్ అన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు అత్యుత్తమ ఆర్థిక ఉత్పత్తులను తీసుకెళ్తామని చెప్పారు. Airtel IQ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్‌లు బలమైన, సులభమైన, సురక్షిత క్లౌడ్ కమ్యూనికేషన్ అందిస్తుందని చెప్పారు.

ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌నకు 4.51 లక్షల పైచిలుకు కస్టమర్లు ఉన్నారు. లైవ్‌ ఇంటెరాక్టివ్‌ కస్టమర్‌ సపోర్ట్‌ ఏజెంట్‌ను సైతం వాట్సాప్‌లో పరిచయం చేయనున్నారు. మొదటగా దేశంలోని టైర్‌-2, టైర్‌-3 నగరాలకు వాట్సాప్‌ బ్యాకింగ్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది 2018 ప్రారంభించారు.

English summary

India Post Payment Bank started whatsapp banking services

India Post Payment Bank has made WhatsApp services available. India Postal Bank has partnered with private telecom giant Airtel to launch banking services.

Story first published: Saturday, April 1, 2023, 10:33 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *