IT News: అంచనాలు మించి రాణించిన HCL టెక్.. FY24లో మొదటి డివిడెండ్ ప్రకటన

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|

IT
News:
మార్చితో
ముగిసిన
త్రైమాసికానికిగాను
HCL
టెక్నాలజీస్
3
వేల
983
కోట్ల
నికర
లాభాన్ని
ఆర్జించినట్లు
ప్రకటించింది.
గతేడాది
ఇదే
సమయంలో
పోస్ట్
చేసిన
3
వేల
593
కోట్లతో
పోలిస్తే,
11
శాతం
పెరుగుదల
నమోదుచేసినట్లు
వెల్లడించింది.

క్వార్టర్లో
కంపెనీ
కార్యకలాపాల
ద్వారా
ఆదాయం
18
శాతం
పెరిగి
26
వేల
606
కోట్లకు
చేరింది.
క్రితం
సంవత్సరంలో
చూస్తే

సంపాదన
22
వేల
597
కోట్లకు
పరిమితమైంది.
అయితే
అంతకు
ముందు
త్రైమాసికంతో
పోలిస్తే
మాత్రం
నికర
లాభం
4
వేల
96
కోట్ల
నుంచి
3
శాతం
మేర
క్షీణించింది

మార్కెట్
వర్గాల
అంచనాను
మించి
నికర
లాభాన్ని
HCL
పోస్ట్
చేసింది.
FY24కి
గాను
స్థిరమైన
కరెన్సీ
(CC)
వద్ద
దాని
ఆదాయం
6-8
శాతం
వరకు
పెరుగుతుందని
కంపెనీ
అంచనా
వేస్తోంది.
EBDIT
మార్జిన్
గైడెన్స్
18-19
శాతం
మధ్య
ఉంటుందని
భావిస్తోంది.
అయితే
ఫలితాల
ప్రకటనకు
ముందు
బుధవారం
నాటికి
NSEలో
HCL
టెక్
షేర్ల
ట్రేడింగ్
0.16
శాతం
నష్టంతో
రూ.1,037
వద్ద
ముగిసింది.

IT News: అంచనాలు మించి రాణించిన HCL టెక్..

ఇంతకు
ముందటి
త్రైమాసికాలతో
పోలిస్తే
నాల్గవ
దానిలో
స్థిరమైన
కరెన్సీ
రాబడి
వృద్ధి
1.2
శాతం
క్షీణించింది
కానీ
ఏడాదికేడాది
10
శాతం
మేర
పెరిగినట్లు
తెలుస్తోంది.
ఆదాయం
సంవత్సరానికి
8
శాతం
చొప్పున
3
వేల
235
మిలియన్
డాలర్లకు
చేరుకుంది.
విభాగాల
వారీగా
చూస్తే,
సేవల
ద్వారా
రాబడి
11
శాతం
YoY
పెరిగింది.
సాఫ్ట్
‌వేర్
రంగం
నుంచి
వచ్చే
ఆదాయంలో
8.2
శాతం
వృద్ధిని
సాధించింది.
వీటికితోడు
డిజిటల్
ఆదాయం
17
శాతం
పెరిగింది.

నోయిడాకు
చెందిన

IT
కంపెనీ
EBDIT
4
వేల
836
కోట్లు
కాగా..
సంవత్సరానికి
19
శాతం
చొప్పున
రాణించింది.

త్రైమాసికంలో
కంపెనీ
13
పెద్ద
డీల్స్
(సర్వీసెస్

10,
సాఫ్ట్
వేర్

10)
గెలుచుకుంది.
వీటి
మొత్తం
కాంట్రాక్ట్
విలువ
2.07
బిలియన్
డాలర్ల
వద్ద
ఉంది.
గతేడాదితో
కలిపి
చూస్తే
8
శాతం
వృద్ధి
సాధించింది.
అయితే
మార్చి
2023తో
ముగిసిన
పూర్తి
సంవత్సరానికి,
కంపెనీ
ఆదాయం
18
శాతం
వృద్ధితో
1
లక్ష
కోట్ల
మార్కును
దాటింది.

మంచి
లాభాల
మీద
జోరుగా
ఉన్న
HCL
టెక్,
ఈక్విటీ
షేరుకి
18
చొప్పున
గురువారం
మధ్యంతర
డివిడెండును
ప్రకటించింది.
కాగా
FY24
ఆర్థిక
సంవత్సరానికి
ఇది
మొదటి
డివిడెండ్
కావడం
విశేషం.
దానికి
సంబంధించి
ఇప్పటికే
రికార్డు
తేదీని
ఈనెల
28గా
నిర్ణయించింది.
పెట్టుబడిదారులకు
పెద్ద
మొత్తంలో
డివిడెండ్
ఇచ్చే
కంపెనీల్లో
HCL
టెక్
ఒకటి
కావడం
గమనార్హం.

English summary

HCL Technologies profit jumped 11% while income increased to 18%

HCL results

Story first published: Friday, April 21, 2023, 8:10 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *