IT News: ఆ కంపెనీ చేసిన పనితో అయోమయంలో ఐటీ ఫ్రెషర్లు.. ఏమైందంటే

[ad_1]

ఎంఫసిస్ కంపెనీలో..

ఎంఫసిస్ కంపెనీలో..

దేశీయ ఐటీ కంపెనీ ఎంఫసిస్‌లో చేరే తేదీ కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్లు కంపెనీకి, రిక్రూట్‌లకు మధ్య వచ్చే లెటర్ ఆఫ్ ఇంటెంట్ గడువు పూర్తి కావటంతో జాబ్ ఆఫర్‌ను కోల్పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. కంపెనీ సెప్టెంబర్ 2021లో ఎంపికైన ఫ్రెషర్లకు అందించింది. అయితే గడచిన ఏడాది కాలంగా వీరు కంపెనీ ఎప్పుడు పిలుస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కంపెనీ ఇచ్చిన జాబ్ ఆఫర్ మార్చిలో ముగుస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు.

ఫ్రెషర్ స్పందన..

ఫ్రెషర్ స్పందన..

2021 సెప్టెంబరులో ఎంఫసిస్ కంపెనీ నుంచి ట్రైనీ అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఎంపికైన ఒక ఫెషర్ దీనిపై స్పందించాడు. తనకు అప్పట్లో కంపెనీ రూ.2.50 లక్షల జీతం అందిస్తామని కంపెనీ ఆఫర్ చేయటంతో అందుకు తాను అంగీకరించినట్లు తెలిపాడు. అయితే కంపెనీ తనను ఆన్ బోర్డ్ చేయలేదని అందుకే గత ఏడాదిగా తాను ఇంట్లోనే వేచి ఉన్నానని తెలిపాడు. అయితే మార్చి 2023తో కంపెనీ ఇచ్చిన ఆఫర్ ముగుస్తుందని.. కంపెనీ వల్ల తాను చాలా కోల్పోయానని ఆవేదన చెందాడు. ఇలాగే నాలుగు లక్షల వార్షిక ప్యాకేజీతో ఎంపికైన మరో వ్యక్తి సైతం ఇదే విషయాన్ని తెలిపాడు.

మరింత మంది ఆందోళన..

మరింత మంది ఆందోళన..

మార్చి 2023తో కంపెనీ అందించిన LOI గడువు ముగుస్తున్న నేపథ్యంలో కంపెనీ ఆన్‌బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్న చాలా మంది ఫ్రెషర్లు అయోమయంలో పడుతున్నారు. ఆఫర్ లెటర్ గడువు తేదీ తర్వాత కంపెనీ తమకు ఉద్యోగం ఇవ్వదేమోనని వారు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంపై చాలా మంది కంపెనీని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైంది.

లెర్నింగ్ అకాడమీ శిక్షణ..

లెర్నింగ్ అకాడమీ శిక్షణ..

కొంత మంది ఎంఫసిస్ లెర్నింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేశారు. ఇది మూడు నెలల పాటు ఉండే కఠినమైన శిక్షణ. ఈ సమయంలో ట్రైనీలకు కంపెనీ ఎలాంటి స్టైఫండ్‌ను చెల్లించలేదని తెలుస్తోంది. అయితే వారిని కంపెనీ రూ.3.25 లక్షల జీతానికి ఆన్ బోర్డింగ్ చేస్తుందని తెలుస్తోంది. అయితే వీరికి కంపెనీ ఇచ్చిన ఆఫర్ లెటర్లు సైతం వచ్చే నెలతో కాలం చెల్లుతాయి. దీంతో చాలా మంది తమ భవిష్యత్తు ఏంటి అనే ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *