IT News: గరిష్ఠాల నుంచి 24 శాతం తరుగుదల.. ఐటీ షేర్లు కొనేందుకు రైట్ టైమ్ ఇదేనా..?

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


IT
News:

ఇటీవల
మార్కెట్
అనిశ్చితులు,
గ్లోబల్
వ్యాపార
పరిస్థితుల
కారణంగా
ఐటీ
రంగంలోని
కంపెనీల
షేర్లు
భారీ
పతనాలను
నమోదు
చేశాయి.
దీనికి
తోడు
ఆదాయాలు
తగ్గుదాయనే
అంచనాలు
వాటి
విలువను
తగ్గించాయి.

ఇలాంటి
సందర్భంలో
భారతీయ
ఐటీ
స్టాక్‌లలో
ఇటీవలి
పతనం
అధిక
విలువను
సూచిస్తుందా
లేదా
కొనుగోలు
చేయడానికి
మంచి
అవకాశాన్ని
అందిస్తుందా
అనే
అనుమానాలు
చాలా
మంది
ఇన్వెస్టర్లలో
ఉన్నాయి.
ప్రస్తుతం

రంగం
షేర్లలో
డిప్
ఉన్నప్పటికీ..
నిఫ్టీ
ఐటీ
సూచీని
గమనించినట్లయితే
ఇప్పటికీ
దాని
10
ఏళ్ల
సగటు
విలువలతో
పోలిస్తే
10%
ప్రీమియంతో
ట్రేడవుతోంది.

IT News: గరిష్ఠాల నుంచి 24 శాతం తరుగుదల.. ఐటీ షేర్లు కొనేందు

టాప్
టెక్
దిగ్గజాలైన
టీసీఎస్,
ఇన్ఫోసిస్,
విప్రో,
హెచ్సీఎల్
టెక్నాలజీస్,
టెక్
మహీంద్రా
వంటి
కంపెనీల
షేర్లు
కరోనా
ముందు
కంటే
అధిక
ధరకు
ట్రేడవుతున్నాయి.
ఇదే
సమయంలో
మిడ్‌క్యాప్
ఐటీ
స్టాక్‌లు
లార్జ్
క్యాప్స్‌తో
పోలిస్తే
25%
ప్రీమియంతో
ట్రేడవుతున్నాయి.
ఇన్ఫోసిస్
స్టాక్
దాని
52
వారాల
గరిష్ఠ
ధర
అయిన
రూ.1,672
స్థాయి
నుంచి
24
శాతానికి
పైగా
క్షీణించింది.
ఇదే
క్రమంలో
టీసీఎస్
స్టాక్
గరిష్ఠాల
నుంచి
11
శాతం,
విప్రో
షేర్
14
శాతం
మేర
క్షీణించాయి.

స్టాక్
ధరల్లో
కరెక్షన్
ఉన్నప్పటికీ..
లార్జ్-క్యాప్
IT
స్టాక్‌ల
ఫార్వర్డ్
PE
రేషియోలను
గమనిస్తే
కొనుగోళ్లకు
బెస్డ్
వ్యాల్యూ
కాకపోవచ్చని
నిపుణులు
చెబుతున్నారు.
అలాగే
ఇటీవల
యాక్సెంచర్
ఆదాయాలపై
చేసిన
కీలక
కామెంట్స్
తర్వాత..
భవిష్యత్తు
త్రైమాసికాల్లో
ఆదాయాలు
తగ్గుతాయని
వెల్లడైంది.
అందువల్ల
షేర్
ధర
రానున్న
కాలంలో
మరింత
కరెక్షన్లకు
గురయ్యే
అవకాశం
ఉందని
బ్రోకరేజ్
కంపెనీలు
అంచనా
వేస్తున్నాయి.
యూఎస్
ఆర్థిక
వ్యవస్థ
స్థిరత్వాన్ని
తిరిగి
పొందగలిగితే..
భారత
ఐటీ
సేవల
కంపెనీల
మంచి
వ్యాపార
అవకాశాలను
పొందగలవు.
ఇది
పరోక్షంగా
వాటి
ఆదాయాల
పెరుగుదలకు
దోహదపడుతుంది.
అప్పుడే
షేర్లు
ఆకర్షనీయంగా
మారతాయని
నిపుణులు
చెబుతున్నారు.

English summary

Is this right time to invest in top IT stocks like, TCS, Infosys, HCL Tech Know

Is this right time to invest in top IT stocks like, TCS, Infosys, HCL Tech Know

Story first published: Tuesday, June 27, 2023, 16:39 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *