ITR-1 ఎవరు ఫైల్‌ చేయకూడదు, మీరు రాంగ్‌ ఫామ్‌ నింపుతున్నారేమో?

[ad_1]

Income Tax Return Filing: జులై నెల ప్రారంభమైంది, ఇన్‌కం టాక్స్‌ రిటర్న్‌ ఫైల్‌ చేయడానికి ఈ నెలాఖరు (జులై 31, 2023) వరకే టైమ్‌ ఉంది. ఆదాయ పన్ను ఫైలింగ్‌లో ఎక్కువ మంది ఎంచుకునే ఫామ్‌ ITR-1. సాధారణంగా, జీతభత్యాల ద్వారా ఆదాయం సంపాదించేవాళ్లు దీనిని ఎంచుకుంటారు. ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రకారం, ఐటీఆర్ ఫామ్‌-1ను సహజ్ ఫామ్‌ అని కూడా అంటారు.

ఉద్యోగులు + ఈ తరహా ఆదాయం ఉన్న వ్యక్తుల కోసం ITR-1 
సాధారణ పన్ను చెల్లింపుదార్లు ITR ఫారం-1 ద్వారా తమ ఆదాయం, పన్ను బాధ్యత ప్రకటిస్తారు. జీతం, డివిడెండ్, బ్యాంకు వడ్డీ, ఒక ఇంటి ఆస్తి, వ్యవసాయం ద్వారా వార్షిక ఆదాయం రూ. 5000 మించని వారు ఈ ఫారం ఎంచుకుంటారు. వార్షిక ఆదాయం రూ. 50 లక్షల వరకు ఉన్న టాక్స్‌ పేయర్లు ఈ ఫామ్‌ పూరించవచ్చు.

మరో ఆసక్తికర కథనం: అప్పర్ సర్క్యూట్‌లో సుజ్లాన్‌ ఎనర్జీ, ఆరో రోజూ ఎనర్జిటిక్‌ రన్‌

ITR ఫారం-1 ఎవరి కోసం కాదు? 

టాక్స్‌ పేయర్‌ పన్ను చెల్లించదగిన ఆదాయం రూ. 50 లక్షల కంటే ఎక్కువ ఉంటే, ITR ఫారం-1ను అతను ఫైల్‌ చేయకూడదు.      

ఒక వ్యక్తి మ్యూచువల్ ఫండ్స్, బంగారం, ఈక్విటీ షేర్లు, ఇంటి ఆస్తి, ఇతర వనరుల నుంచి ఆదాయాన్ని ఆర్జిస్తే, అతను ITR-1ను పూరించలేడు.  

గుర్రపు పందాలు, లాటరీలు, చట్టబద్ధమైన జూదం వంటి ఆస్తి లేదా సేవల నుంచి ఒక వ్యక్తి ఆదాయం సంపాదించినట్లయితే, అతను కూడా ITR-1ని ఫైల్ చేయడానికి కూడా అర్హుడు కాదు. 

ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఇంటి ఆస్తుల ద్వారా ఆదాయం వస్తుంటే, అతను కూడా ITR-1 ఫైల్ చేయలేడు.  

NRI (Non-Resident Indian) కూడా ITR-1 ఫైల్ చేయడానికి అర్హుడు కాదు.        

బ్యాంక్ నుంచి నగదు విత్‌డ్రా చేస్తున్నప్పుడు, ఇన్‌కమ్‌ టాక్స్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 194N ప్రకారం TDS (Tax Deducted at Source) కట్‌ అయితే, అలాంటి టాక్స్‌ పేయర్‌ కూడా ITR-1 ఫామ్‌ ఉపయోగించకూడదు.        

హిందు అవిభక్త కుటుంబాలు (HUFలు) కూడా ITR-1ని ఫైల్ చేయకూడదు.      

అర్హత లేనప్పటికీ ITR-1 ఫైల్ చేస్తే ఏమవుతుంది?
ITR-1 ఫైల్ చేయడానికి అర్హత లేని వ్యక్తి పొరపాటున అదే ఫారాన్ని ఫైల్ చేస్తే, ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి నోటీసు రావచ్చు. మీరు తప్పుడు ఫామ్‌ ఫైల్‌ చేశారని ఆ నోటీసులో ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో, ITR నోటీసు అందిన తేదీ నుంచి 15 రోజుల లోపు సరైన ఫారాన్ని మళ్లీ దాఖలు చేయాలి. లేకపోతే, మీరు మొదట పంపిన ITR చెల్లకుండా పోతుంది. ఆ తర్వాత, ఇన్‌కమ్‌ టాక్స్‌డిపార్ట్‌మెంట్‌ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది.

మరో ఆసక్తికర కథనం: కేవలం ₹100కే రైల్వే స్టేషన్‌లో రూమ్‌ – హోటల్‌ గదిలా ఉంటుంది 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial  

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *