[ad_1]
ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ లో లభ్యం:
రిలయన్స్ జియో తన తొలి ల్యాప్ టాప్‌ను విడుదల చేసింది. ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ (GeM) పోర్టల్ లో దీనిని అందుబాటులో ఉంచారు. ల్యాప్ టాప్ ఫీచర్లు, ధరను అందులో పేర్కొన్నారు. Jio క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ (Qualcomm Snapdragon) 665 ప్రాసెసర్ తో 11.6 అంగుళాల నెట్‌బుక్‌గా పరిచయం చేశారు. ల్యాప్‌టాప్ ధర 19,500గా నిర్ణయించారు.
మరి సాధారణ ప్రజలకు ?
ఇప్పటికే అమ్మకానికి పెట్టినా.. సాధారణ ప్రజలు కొనుగోలు చేసే అవకాశం ప్రస్తుతం లేదు. కేవలం ప్రభుత్వ విభాగాలు మాత్రమే GeM పోర్టల్ ద్వారా షాపింగ్ చేయగలవు. దీపావళి నాటికి సామాన్య ప్రజలకు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. JioBook 6వ ఎడిషన్ ను ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC), 2022లో ప్రదర్శనకు ఉంచారు.
జియో ల్యాప్‌టాప్ ఫీచర్లు:
ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ లో పేర్కొన్న ప్రకారం.. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ను ల్యాప్ టాప్ లో పొందుపరిచారు. మెటాలిక్ హింగ్‌లతో స్టాండర్డ్ ఫాం ఫ్యాక్టర్‌ని కలిగి ఉంది. ABS ప్లాస్టిక్‌తో తయారు చేయబడింది. కంపెనీ స్వంత Jio OS ఆపరేటింగ్ సిస్టమ్ పై ఆధారపడి పనిచేస్తుంది. 2GB LPDDR4X ర్యామ్ ఇందులో ఉన్నట్లు స్పెసిఫికేషన్స్ షీట్ లో తెలిపారు. RAM సామర్థ్యం పెంచుకునే అవకాశం ఇవ్వలేదు. 32GB eMMC స్టోరేజి సౌకర్యం కల్పించారు.
ఇదీ కాన్ఫిగరేషన్:
11.6 అంగుళాల HD LED బ్యాక్ లైట్ యాంటీ గ్లేర్ డిస్‌ప్లే Jio ల్యాప్‌టాప్ సొంతం. 1366×768 పిక్సెల్ రిజల్యూషన్ తో కూడిన నాన్-టచ్ స్క్రీన్ ఇందులో అమర్చారు. USB 2.0, USB 3.0, HDMI పోర్ట్ లు ఉన్నాయి. USB టైప్-సి పోర్ట్‌లు అందుబాటులో లేవు. మైక్రో SD కార్డ్ స్లాట్ ఉండటం విశేషం. వైర్‌లెస్ కనెక్టివిటీ కోసం Wi-Fi 802.11ac, బ్లూటూత్ వెర్షన్ 5.2తో పాటు 4G మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని కూడా సపోర్ట్ చేస్తుంది.
వేలిముద్ర లేదు:
చెరో రెండు ఇంటర్నల్ స్పీకర్లు, మైక్రోఫోన్‌లతో జియో ల్యాప్‌టాప్ వస్తుంది. స్టాండర్డ్ సైజ్ కీబోర్డ్, మల్టీ గెస్చర్ సపోర్ట్‌తో కూడిన టచ్‌ప్యాడ్ ఉంది. కానీ వేలిముద్ర స్కానర్ లేదు. 8 గంటల వరకు బ్యాకప్ ఇచ్చే విధంగా 55.1-60Ah బ్యాటరీ సామర్థ్యాన్ని ల్యాప్‌టాప్ కలిగి ఉంది. 1.2 కిలోల బరువు ఉంది. ఏడాది బ్రాండ్ వారంటీతో లభిస్తుంది.
[ad_2]
Source link
Leave a Reply