J&K Lithium: ఈవీ కలలకు కశ్మీరీ లిథియం.. భారత ప్రజలు పొందే లాభాలు ఇవే..

[ad_1]

బ్యాటరీల వృద్ధికి..

బ్యాటరీల వృద్ధికి..

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన వివరాలు భారత ఈవీ రంగానికి పెద్ద వరంగా కనిపిస్తున్నాయి. లిథియం అయాన్ బ్యాటరీల్లో ఈ ముడిపదార్థాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం శిలాజ ఇంధన వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలని చేస్తున్న ప్రయత్నానికి ఇది ఎంతగానో దోహదపడనుంది.

దేశంలో లిథియం నిక్షేపాలు దొరకటం వల్ల బ్యాటరీలు తక్కువ ధరకే అందుబాటులోకి వస్తాయని.. దేశీయంగా బ్యాటరీలను తయారు చేసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని తెలుస్తోంది.

తక్కువ ధరకే వాహనాలు..

తక్కువ ధరకే వాహనాలు..

లిథియం నిల్వలు బయటపడటం రానున్న కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గటానికి దోహదపడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది దేశంలోని ప్రజలు వేగంగా ఎలక్ట్రిక్ వాహనాలవైపు మళ్లేందుకు పరోక్షంగా ప్రోత్సాహకానిస్తుందని చార్జ్ అప్ స్టార్టప్ వ్యవస్థాపకుడు వరుణ్ గోయంకా అన్నారు.

2070 నాటికి సున్నా కర్భన ఉత్గారాల లక్ష్యాన్ని చేరుకోవాలని మోదీ సర్కాక్ సంకల్పానికి ఇది అండగా నిలుస్తుందని ఆయన అన్నారు. 2021లో గ్లాస్గో వాతావరణ మార్పుల సమావేశంలో మోదీ వాగ్దానాన్ని ఈ సందర్బంగా గుర్తుచేశారు.

తగ్గిపోతున్న దిగుమతులు..

తగ్గిపోతున్న దిగుమతులు..

ప్రస్తుతం భారత వాహన రంగం ఎక్కువగా ఈవీల ఉత్పత్తికి అవసరమైన సెల్స్ ను దిగుమతి చేసుకుంటోంది. ఈ కారణంగా గత ఏడాది చాలా బ్యాటరీలు పేలిపోవటం, కాలిపోవటం లాంటి దుర్ఘటనలు కూడా చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

పైగా బ్యాటరీల కోసం కంపెనీలు చైనా, తైవాన్, సౌత్ కొరియా వంటి దేశాలపై అధికంగా ఆధారపడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ రాజకీయ వాతావరణంలో చైనాపై భారత్ అధారపడటాన్ని తాజాగా వెలుగులోకి వచ్చిన లిథియం నిల్వలు తగ్గించటానికి దోహదపడనున్నాయని నిపుణులు చెబుతున్నారు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *