[ad_1]
అంత మంచిది కాదు:
ఉద్యోగాల కోతలను దృష్టిలో పెట్టుకుని కొన్ని సంస్థలు జాబ్ లాస్ ఇన్సూరెన్స్ ను సైతం అందిస్తున్నాయి. నెల నెలా వస్తున్న జీతం.. లే ఆఫ్ వల్ల ఒక్కసారిగా ఆగిపోతే ఏర్పడే ఆర్థిక ఇబ్బందులకు ఇదొక చక్కటి పరిష్కారమని చెబుతున్నాయి. గృహ, ఆటో రుణం ఉంటే.. మరో ఉద్యోగం సాధించే లోపు సమర్థవంతంగా మేనేజ్ చేయవచ్చని అనేక మంది అనుకుంటారు. కానీ వాస్తవానికి ఈ తరహా ఇన్సూరెన్స్ అంత మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కంపెనీ తొలగిస్తేనే కవరేజి:
నిబంధనల ప్రకారం పనిచేస్తున్న సంస్థ ఉద్యోగంలో నుంచి తొలగిస్తేనే ఉద్యోగి బీమా క్లైమ్ చేయవచ్చు. కానీ వాస్తవానికి కంపెనీలు ఉద్యోగులను రాజీనామా చేయాలని ఒత్తిడి తెస్తాయి కానీ తొలగించే పరిస్థితులు చాలా తక్కువ. స్వచ్ఛందంగా ఉద్యోగం మానేయలేదని నిరూపించుకోవడం చాలా కష్టం. కాబట్టి బీమా సొమ్ము పొందే అవకాశం ఉండదు.
సరైన ప్రణాళిక అవసరం:
రుణం తీసుకోవాలనే ఆలోచన ఉంటే.. ఉద్యోగంలో ఉన్నప్పుడే తిరిగి చెల్లించడానికి సరైన విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కనీసం మూడు నెలల ఈఎంఐను ముందుగా సమీకరించి ఉంచుకుంటే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందీ తలెత్తదని చెబుతున్నారు. అత్యవసర సమయాల్లో ఈ ధనాన్ని ఇతర అవసరాలకు సైతం వినియోగించుకోవచ్చని సలహా ఇస్తున్నారు.
[ad_2]
Source link
Leave a Reply