[ad_1]
కొలెస్ట్రాల్ కరిగిస్తుంది..
సీమచింతలో పుష్కలంగా ఉండే విటమిన్ సి చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. సీమచింతలో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గుండె సమస్యలతో బాధపడేవారు ఈ కాయ తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో 1 స్పూన్ ఈ గింజలు తింటే.. గుండెకు మంచిది..!
యాంటీ క్యాన్సర్ లక్షణాలు..
సీమ చింతకాయలో యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉంటాయని ఓ అధ్యయనం స్పషం చేసింది. ఈ కాయ ఆకులలోని యాంటీకాన్సర్ ఏజెంట్లు రొమ్ము క్యాన్సర్ కణాల సంఖ్యను తగ్గించడంలో సహాయపడతాయని ఓ అధ్యయనం తెలిపింది.
గట్ సమస్యలను నయం చేస్తుంది
సీమ చింతకాయలో ఫ్లేవనాయిడ్స్, క్వెర్సెటిన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌ల స్టోర్‌హౌస్. ఇది కడుపు, పేగులో హానికరమైన ఫ్రీ రాడికల్స్, టాక్సిన్స్‌ను తొలగించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. ఈ కాయల్లోని ఫైబర్ పేగల కదలికలను మెరుగుపరుస్తుంది. అతిసారం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను నయం చేస్తుంది. సీమ చింతలో యాంటీఆక్సిడేటివ్, యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఇవి పేగులకు హాని కలిగించే షిగెల్లా, ఇ.కోలి వంటి వ్యాధికారక క్రిములకు వ్యతిరేకంగా పోరాడతాయి.
బరువు తగ్గుతారు..
సీమ చింతలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపును నిండుగా ఉంచుతుంది, తినాలనే కోరికలను నియంత్రణలో ఉంచుతుంది, ఆకలిని కంట్రోల్‌లో ఉంచుతుంది. దీంతో మీ బరువు కంట్రోల్‌లో ఉంటుంది. సీమ చింతలో విటమిన్ సి, డైటరీ ఫైబర్, సపోనిన్‌ల అధిక బరువును తగ్గించడానికి సహాయపడతాయి. సపోనిన్లు దాదాపు 20-30 శాతం బరువును తగ్గించగలవని ఒక అధ్యయనం పేర్కొంది.
నోటి ఆరోగ్యానికి మంచిది..
సీమచింతలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ పళ్లను దృఢంగా ఉంచుతాయి. ఇవి దంతాల ఎనామెల్‌ను బలోపేతం చేస్తాయి. దీనిలో యాంటీమైక్రోబయల్ ఏజెంట్లు, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి నోటి పుండ్లను నయం చేస్తాయి.
Health Tips:ఈ అలవాట్లు మీ ఆరోగ్యానికి హానికరం..!
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply