Kidney Health: కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే.. సూపర్‌ ఫుడ్స్‌ ఇవే..!

[ad_1]

పాలకూర..

పాలకూర..

పాలకూరలో ఐరన్‌, కాల్షియం, విటమిన్‌ B9 వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు కిడ్నీ ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి, మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మీరు పాలకూరను కూరలు, పప్పు, స్మూతీలలోనూ యాడ్‌ చేసుకోవచ్చు.

(image source – pixabay)​Thyroid Health: థైరాయిడ్‌ పేషెంట్స్‌ కచ్చితంగా తినాల్సిన.. అయోడిన్‌ రిచ్‌ ఫుడ్స్‌..!

బాదం..

బాదం..

ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లతో నిండిన బాదంలో అధిక స్థాయిలో మెగ్నీషియం ఉంటుంది. ఇది కిడ్నీ ఆరోగ్ని రక్షించుకోవడంలో కీలకమైన కారకం అయిన రక్తపోటును నియంత్రించడంలో తోడ్పడుతుంది.అయితే, బాదంపప్పులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని మితంగా తినాలని గుర్తుంచుకోండి.​

Food Allergy: సాధారణంగా వచ్చే.. ఫుడ్‌ అలెర్జీలు ఇవే..!(image source – pixabay)

క్వినోవా..

క్వినోవా..

క్వినోవాలో ప్రొటీన్‌, ఫైబర్‌, అవసరమైన అమైవో యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీల ఆరోగ్యానికి అద్భుతమైన ఎంపిక అని చెప్పొచ్చు. క్వినోవాను అన్నం, రోటీలకు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. (image source – pixabay)

కాలే..

కాలే..

కాలో క్రూసిఫెరస్‌ కుటుంబానికి చెందిన కూరగాయ. కాలేలో విటమిన్‌ A, C, ఐరన్‌, కాల్షియ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు కిడ్నీల పనితీరుకు మద్దతు ఇస్తుంది. కాలే కిడ్నీలకు సూపర్‌ ఫుడ్‌ అని చెప్పొచ్చు. కాలేను సలాడ్లు, వంటలలో చేర్చవచ్చు. (image source – pixabay)

బ్లూబెర్రీస్..

బ్లూబెర్రీస్..

ఈ చిన్న బెర్రీలు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. వీటిలో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు.. ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా కిడ్నీలకు జరిగే నష్టాన్ని తగ్గిస్తాయి.

(image source – pixabay)

చియా విత్తనాలు..

చియా విత్తనాలు..

చియా సీడ్స్‌లో ఫైబర్, ఆరోగ్యకరమైన ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్‌, మొక్కల ఆధారిత ప్రోటీన్ అద్భుతమైన మూలం. ఇవి ఆరోగ్యకరమైన జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ప్రోత్సహిస్తాయి. ఇది సరైన మూత్రపిండాల పనితీరుకు మద్దతు ఇస్తాయి. మీరు సలాడ్లు, పుడ్డింగ్స్‌, స్మూతీస్‌లో చియా గింజలను యాడ్‌ చేసుకోవచ్చు.

(image source – pixabay)

పప్పు..

పప్పు..

పప్పులో డైటరీ ఫైబర్, ప్రొటీన్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి, ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. మీ డైట్‌లో తరచుగా పప్పు తీసుకుంటే.. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

(image source – pixabay)

చిలగడదుంపలు

చిలగడదుంపలు

చిలగడదుంపల్లో ఫైబర్‌, విటమిన్‌ ఏ, సి అధికంగా ఉంటాయి. చిలగడదుంపల్లో సాధారణ బంగాళదుంపలతో పోలిస్తే.. పొటాషియం కంటెంట్‌ తక్కువగా ఉంటుంది, ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

(image source – pixabay)​

Health Care: ఈ ఆహారం తింటే.. 40 తర్వాత కూడా ఫిట్‌గా ఉంటారు..!​

బ్రకోలీ..

బ్రకోలీ..

బ్రకోలీలో యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు, ఫైబర్‌ మెండుగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు మేలు చేస్తాయి. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ఇది శరీరంలోని వాపును తగ్గిస్తాయి. తద్వారా మూత్రపిండాల ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.

(image source – pixabay)
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *