[ad_1]
News
oi-Chekkilla Srinivas
హైదరాబాద్ ఇప్పుడు ముంబై తర్వాత అత్యంత ఖరీదైన నగరంగా మారింది. దేశ రాజధాని న్యూఢిల్లీని మూడో స్థానానికి నెట్టింది. వార్షిక యాజమాన్య అధ్యయనం, స్తోమత సూచిక 2022 ఆధారంగా 2021తో పోలిస్తే ఈ సంవత్సరం నగరంలో గృహ కొనుగోలు స్థోమత స్థాయి తగ్గిందని నైట్ ఫ్రాంక్ అధ్యయనం పేర్కొంది.
అధ్యయనం ప్రకారం, రెపో రేటులో 225 బేసిస్ పాయింట్ల పెరుగుదల, పర్యవసానంగా గృహ-రుణ రేట్లు పెరగడం, నివాస ధరల పెరుగుదల కారణంగా తగ్గిందని నివేదిక పేర్కొంది. అయినప్పటికీ, ఇది మహమ్మారికి ముందు ఉన్న స్థాయిల కంటే మెరుగ్గా ఉందని అధ్యయనం తెలిపింది.
2011లో 53 శాతం ఉన్న గృహ కొనుగోలు స్థోమత సూచిక 2019లో 34 శాతానికి చేరింది. 2020 ప్రారంభంలో మహమ్మారి రాకతో, 2021లో స్తోమత సూచిక 28 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం ఇది 30 శాతంగా ఉంది. స్తోమత సూచిక అనేది నగరంలోని హౌసింగ్ యూనిట్ నెలవారీ వాయిదా (EMI)కి నిధులు సమకూర్చడానికి ఒక కుటుంబానికి అవసరమైన ఆదాయ నిష్పత్తిని సూచిస్తుంది.
హైదరాబాద్‌లోని సగటు కుటుంబం తమ ఆదాయంలో 30 శాతాన్ని గృహ రుణ EMI కోసం ఖర్చు చేస్తున్నారు. 2022లో 53 శాతం స్తోమత నిష్పత్తిని నమోదు చేసిన ముంబై మినహా, మిగతా అన్ని నగరాలు 50 శాతం నిష్పత్తితో కూడిన స్తోమత స్థాయి కంటే చాలా తక్కువగా నమోదయ్యాయని నివేదిక పేర్కొంది.
అహ్మదాబాద్ 2022లో 22 శాతం స్తోమత నిష్పత్తితో దేశంలోనే అత్యంత సరసమైన హౌసింగ్ మార్కెట్‌గా అవతరించింది. తర్వాత కోల్‌కతా, పూణే 2022లో 25 శాతం చొప్పున ఉన్నాయి. పాన్-ఇండియా ప్రాతిపదికన, 2022లో 10 సంవత్సరాలలో మొదటిసారిగా గృహ స్తోమత స్వల్పంగా దిగజారింది.
2020, 2021 మహమ్మారి-ప్రభావిత సంవత్సరాల్లో కూడా నివాస ధరల పెరుగుదల తగ్గుముఖం పట్టడంతో పాటు ప్రభుత్వం విధాన రేట్లను తగ్గించడంతో స్తోమత స్థాయిలు మెరుగుపడ్డాయి.
నైట్ ఫ్రాంక్ అఫర్డబిలిటీ ఇండెక్స్ ప్రకారం కొనుగోలుదారుల ఇంటిని కొనుగోలు చేసే సామర్థ్యాన్ని నిర్ణయించడానికి ఆస్తి ధరలు, గృహ రుణ వడ్డీ రేట్లు, సగటు గృహ ఆదాయం వంటి కీలక అంశాలలో కదలికను పరిశీలిస్తుంది.
“2022లో రెపో రేటు 225 బిపిఎస్‌లు పెరిగినప్పటికీ, గృహాల ధరలు పెరిగినప్పటికీ, ప్రధాన నగరాల్లో గృహ స్థోమత స్వల్పంగా 100 నుంచి 200 బిపిఎస్‌లు మాత్రమే తగ్గిందని నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ తెలిపారు. గృహ రుణాల రేట్లు, ధరల పెరుగుదల ప్రభావం స్థోమత ఇండెక్స్‌పై ప్రభావం చూపిందన్నారు.
English summary
Hyderabad has now become the most expensive city after Mumbai
Hyderabad has now become the most expensive city after Mumbai. Pushing the national capital New Delhi to the third position
Story first published: Saturday, December 31, 2022, 18:00 [IST]
[ad_2]
Source link
Leave a Reply