layoffs: గూగుల్లో మరోసారి లేఆఫ్లు తప్పవా ? రోజుకి ఇన్ని ఉద్యోగాలు ఊడుతున్నాయంటే నమ్మరేమో..

[ad_1]

లేఆఫ్ లకు తోడు జీతాల తగ్గింపు:

లేఆఫ్ లకు తోడు జీతాల తగ్గింపు:

లేఆఫ్ ల మోత కేవలం ఒక్క ఐటీ రంగానికే పరిమితం కాలేదు. మీడియా, ఫ్యాషన్, రిటైల్, బ్యాంకింగ్ సహా పలు సెక్టార్లకు సైతం విస్తరించింది. 2022 ఏడాది చివరి నుంచి వీటికి బీజం పడింది. అయితే గత రెండు నెలలను నిశితంగా గమనిస్తే, ప్రతిరోజూ దాదాపు 2,700 మంది కొలువులు కోల్పోయినట్లు చెబుతున్న గణాంకాలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. గతేడాది 2 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోగా, ఈ రెండు నెలల్లోనే 1.5 లక్షల సిబ్బందిపై వేటు పడింది. వీటికి అదనంగా, కొన్ని సంస్థలు ఉన్న ఉద్యోగుల జీతాలనూ తగ్గించడం మొదలుపెట్టాయి.

 ITతో పాటు ఇతర రంగాలూ సై..

ITతో పాటు ఇతర రంగాలూ సై..

వివిధ దేశాల్లో పెరుగుతున్న ద్రవ్యోల్భణం, అమెరికా-చైనా మధ్య ఏర్పడిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, కొవిడ్ అనంతర ఆర్థిక మందగమనం వెరసి ఉద్యోగుల పాలిట శాపాలయ్యాయి. టెక్ సంస్థలతో పాటు CNN, మెకిన్సే, మోర్గాన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా, H&M వంటి బహుళ జాతి సంస్థలు సైతం ఉద్యోగులను తొలగిస్తూ.. తమ ఆర్థిక స్థితిని కాపాడుకుంటున్నాయి. ఈ పరిస్థితి కేవలం విదేశాలకే పరిమితం కాలేదు. ఒక్క భారత్ లోనే కేవలం స్టార్టప్లే 22 వేలకు పైగా ఉద్యోగాల్లో కోత విధించి షాక్ ఇచ్చాయి. ఈ పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయోనని ఎదురుచూడటం మినహా ఏమీ చేయలేకపోతున్నామని ఉద్యోగార్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

మరో పది రెట్టు ఉద్యోగాలకు ఎసరు?

మరో పది రెట్టు ఉద్యోగాలకు ఎసరు?

ఆయా కంపెనీలు తమ లాభాలను పెంచుకోవడానికి వ్యయాలను తగ్గించుకోవడంపై దృష్టి పెట్టడంతో ఈ పరిస్థితి నెలకొందని విశ్లేషకులు చెబుతున్నారు. వివిధ సంస్థల్లో ఈ తరహా వైఖరి పెరుగుతున్నందున తొలగింపులు ఇప్పట్లో మందగించే అవకాశం కనిపించడం లేదని భావిస్తున్నారు. కేవలం ఉద్యోగులను మాత్రమే తీసేస్తున్నారు అనుకుంటే పొరపాటే అవుతుంది. తన కాఫ్టేరియాను శుభ్రపరచే రోబోట్లను సైతం గూగుల్ వదలలేదు. అయితే ఇప్పటివరకు తొలగించిన వారి కంటే 10 రెట్లు మరింత ఎక్కువ మందిని తీసివేయాలని.. కంపెనీకి చెందిన ఓ ప్రముఖ ఇన్వెస్టర్ సూచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చూడాలి మరి.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *