Lemon Water: ఖాళీ కడుపుతో నిమ్మరసం నీళ్లు తాగితే.. ఇన్ని లాభాలా..?

[ad_1]

డిటాక్స్‌ చేస్తుంది..

డిటాక్స్‌ చేస్తుంది..

నిమ్మకాయలలో ఫ్లేవనాయిడ్స్‌ అధికంగా ఉంటాయి. వీటికి యాంటీఆక్సిడెంట్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అలాగే నిమ్మరసంలోని విటమిన్‌ సి, శక్తివంతమైనన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. శరీరంలో కణాలకు నష్టం చేసే ఫ్రీ రాడికల్స్‌తో యాంటీఆక్సిడెంట్లు పోరాడతాయి. అలాగే ఆక్సీకరణ ఒత్తిడిని నియంత్రిస్తాయి. ఉదయం పూట నిమ్మరసం నీళ్లు తాగితే శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్స్‌ తొలగుతాయి. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

(image source – pixabay)

heart patients care: హార్ట్‌ పేషెంట్స్‌.. రోజూ ఈ నియమాలు కచ్చితంగా పాటించాలి..!

జీర్ణక్రియకు తోడ్పడుతుంది..

జీర్ణక్రియకు తోడ్పడుతుంది..

ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల గ్యాస్ట్రిక్ జ్యూస్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, ఇది మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.

(image source – pixabay)

విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది

విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది

నిమ్మకాయలు, ఇతర సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి శరీర కణాలను రక్షించడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. అదనంగా, విటమిన్ సి మీ శరీరంలో హార్మోన్ల ఉత్పత్తి, ఐరన్‌ శోషణ, కొల్లాజెన్ సంశ్లేషణలో సహాయపడుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది, ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.

(image source – pixabay)​

Fruits Ease Constipation: ఈ పండ్లు తింటే.. మలబద్ధకం తగ్గుతుంది..!

హైడ్రేట్‌ చేస్తుంది..

హైడ్రేట్‌ చేస్తుంది..

మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి, నిమ్మరసం నీళ్లు ఎఫెక్టివ్‌ మార్గాం. మీరు ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉండటానికి రోజంతా హైడ్రేట్‌గా ఉండటం చాలా ముఖ్యం. మీరు రోజు తగినంత నీరు తాగాలని గుర్తుంచుకోండి.

(image source – pixabay)

బరువు తగ్గడం..

బరువు తగ్గడం..

నిమ్మకాయలోని పెక్టిన్ ఫైబర్ తినాలనే మీ కోరికలను తగ్గిస్తుంది, ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నిమ్మరసం నీరు సహజంగా ఆకలిని అణిచివేస్తుంది. నిమ్మ, నీరు, ఇతర పండ్లతో తయారు చేసే డిటాక్స్‌ వాటర్‌ జీవక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. (image source – pixabay)​

Liver Health: మహిళల్లో లివర్‌ సమస్యలకు కారణాలు ఇవే..!

కిడ్నీలకు మేలు చేస్తుంది..

కిడ్నీలకు మేలు చేస్తుంది..

ఓ అధ్యయనం ప్రకారం నిమ్మరసం నీళ్లు మూత్రపిండాల్లో రాళ్లను కరిగిస్తుంది. కిడ్నీలో ఖనిజాలు చేరడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. అవి సాధారణంగా కాల్షియం ఆక్సలేట్‌‌తో ఏర్పడతాయి. సిట్రేట్‌ను దీనికి ఔషధంగా పనిచేస్తుంది.

(image source – pixabay)

శరీరాన్ని ఆల్కలైజ్ చేస్తుంది..

శరీరాన్ని ఆల్కలైజ్ చేస్తుంది..

నిమ్మరసంలో యాసిడ్‌ ఉన్నప్పటికీ, అవి శరీరంపై ఆల్కలైజింగ్ ఎఫెక్ట్‌ చూపిస్తాయి. శరీరం pH స్థాయిలను సమతుల్యం చేయడానికి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుచడానికి తోడ్పడుతుంది. (image source – pixabay)

శ్వాసను ఫ్రెష్ చేస్తుంది

 శ్వాసను ఫ్రెష్ చేస్తుంది

లెమన్ వాటర్‌లో సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది శ్వాసను తాజాగా చేయడానికి, బ్యాక్టీరియా వల్ల వచ్చే నోటి దుర్వాసనను నివారించడానికి సహాయపడుతుంది.

(image source – pixabay)

హృదయనాళ ఆరోగ్యానికి తోడ్పడుతుంది..

హృదయనాళ ఆరోగ్యానికి తోడ్పడుతుంది..

నిమ్మకాయలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ ఏర్పడకుండా నిరోధిస్తాయి. తద్వారా హృదయ సంబంధ వ్యాధుల ముప్పు తగ్గుతుంది. నిమ్మకాయ నీటిలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్‌లు ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యం, కండరాల పనితీరుతో సహా సరైన శారీరక విధులకు అవసరం.

(image source – pixabay)

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *