[ad_1]
Also Read : Belly fat exercises : ఈ 6 ఎక్సర్‌సైజెస్‌తో బెల్లీ ఈజీగా తగ్గుతుందట..
పనీర్ తయారీకి..
ఓ కప్పు మైసూర్ పప్పు అదే ఎర్ర కందిపప్పు తీసుకుని బాగా కడగండి. తర్వాత అందులో ఒకటిన్నర కప్పులు గోరువెచ్చని నీటిని నింపి అలానే ఉంచండి. 20 నిమిషాల తర్వాత ఈ పప్పుని మెత్తగా మిక్సీ పట్టండి. ఇది మెత్తగా కాటుకలా ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఈ పనీర్ తయారీకి వాడే ఎర్ర కందిపప్పు కాస్తా బైండింగ్ గుణాలు ఉంటాయి. దీంతో పనీర్ చేయడం చాలా ఈజీ అవుతుంది.
ఉడికించండి..
ఇప్పుడు నాన్‌స్టిక్ పాన్‌లో పప్పు మిశ్రమంతో పాటు ఒకటిన్నర కప్పుల నీరు పోసి మిక్స్ చేసి 7 నుంచి 8 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించండి. మిశ్రమం మెత్తగా అయ్యే వరకూ ఇలా ఉడికిస్తూనే ఉండండి.
Also Read : Sugar Disadvantages : చక్కెర ఎక్కువగా తింటున్నారా.. ఈ సమస్యలు తప్పవు..
గాజు కంటెయినర్‌లో..
తయారైన మిశ్రమాన్ని ఓ కంటెయినర్‌లో పోసి ఫ్లాట్‌గా చేయండి. ఇప్పుడు ఆ కంటెయినర్‌పై సరిగ్గా మూతపెట్టి 6 గంటల పాటు పక్కన పెట్టండి. ఈలోపు పప్పు మిశ్రమం సెట్ అవుతుంది.
పనీర్ తయారయ్యాక..
6 గంటల తర్వాత పనీర్ చక్కగా తయారవుతుంది. ఇప్పుడు ఈ పనీర్‌ని తీసి ముక్కలుగా కట్ చేసి స్టోర్ చేసుకోండి. దీనని మనం కూరల్లో, ఫ్రైస్, శాండ్‌విచ్‌లో వాడుకోవచ్చు. ఏంచక్కా దీనిని తినొచ్చు.
పోషకాలు..
పప్పులతో తయారైన ఈ పనీర్ చాలా రుచిగా ఉంటుంది. చక్కగా ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి బరువు పెరుగుతామనే భయం ఉండదు. దీంతో పాటు కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. అయితే, దీనిని పప్పులతో తయారు చేశాం కాబట్టి, ఎక్కువ రోజులు వాడొద్దొని గుర్తుపెట్టుకోండి. వీలైనంత త్వరగా వాడితే చాలా మంచిది.
Also Read : Vitamin b12 : తరచుగా తలనొప్పి వస్తుందా.. ఇదే కారణం కావొచ్చు..
బయట కొనుక్కొచ్చే పదార్థాల కంటే ఇంట్లోనే ఇలా కొన్నింటిని తయారు చేయడం వల్ల ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్లు అవుతుంది. ఖర్చు తక్కువే అవుతుంది. మనం చేసుకున్నాం కాబట్టి శుభ్రత ఎలానూ ఉండనే ఉంటుంది. అందుకే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు, రావు. ఇలా తయారైన ఫుడ్స్‌ని ఎలా వాడాలో కూడా తెలుసుకోవాలి. కేవలం ఎర్ర కందిపప్పుతో మాత్రమే కాదు. అనేక పదార్థాలతోనూ వీటిని చక్కగా తయారు చేసుకోవచ్చు.
తయారైన వీటితోనూ ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు. వీటిని మీరూ ఎంజాయ్ చేయొచ్చు.
[ad_2]
Source link
Leave a Reply