LPG Cylinder Price: శుభవార్త చెప్పిన చమురు సంస్థలు.. తగ్గిన వంట గ్యాస్ ధర..

[ad_1]

News

oi-Chekkilla Srinivas

|

చమురు సంస్థలు సామాన్యులకు శుభవార్త చెప్పాయి. వంట గ్యాస్ ధరలను తగ్గించాయి. తగ్గిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయనప్పటికీ వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ.92 లకు తగ్గించారు. అయితే గత సంవత్సరం గృహ వినియోగ LPG సిలిండర్ల రేటును నాలుగు సార్లు పెంచారు. మార్చిలో డొమెస్టిక్ సిలిండర్ ధరను రూ. 50 పెంచగా.. వాణిజ్య సిలిండర్ ధరను రూ. 350 పెంచారు.

ఈ సంవత్సరం జనవరిలో వాణిజ్య సిలిండర్ల ధర రూ.25 పెరిగింది. తాజా రూ.92 తగ్గింపుతో కాస్త ఉపశమనం లభించనుంది. గతేడాది 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రూ.2,253గా ఉంది. ఆ తర్వాత రూ.225 తగ్గింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకం యొక్క 9.59 కోట్ల మంది లబ్ధిదారులు ప్రతి 14.2 కిలోల ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్‌పై సంవత్సరానికి రూ.200 సబ్సిడీని పొందుతారని కేంద్రం చెప్పింది.కాగా చమురు ధర వరుసగా ఐదవ నెలలో పడిపోయింది.

LPG Cylinder Price: శుభవార్త చెప్పిన చమురు సంస్థలు..

అయితే గృహ వినయోగ సిలిండర్ ధర తగ్గించాలని సామాన్య ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో రూ. గృహ వినియోగ సిలిండర్ ధర రూ. 1155గా ఉంది. బెంగళూరులో రూ.1105, చెన్నైలో రూ.1118 గా ఉంది. గతంలో గృహ వినయోగ సిలండర్ అన్నింటిపై సబ్సిడీ ఇచ్చే వారు.. ఆ సబ్సిడీని క్రమంగా ఎత్తివేశారు. ఇప్పుడు కేవలం ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్నవారికే రూ.200 సబ్సిడీ లభించనుంది.

English summary

Commercial LPG cylinder price down by rs 92

Oil companies have good news for the common man. Cooking gas prices have come down. The reduced prices will be effective from April 1.

Story first published: Saturday, April 1, 2023, 9:02 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *