Luna 25 Crash: లూనా కూలిపోవడంతో చంద్రుడిపై భారీ గుంత.. ఫోటోలు విడుదల చేసిన నాసా

[ad_1]

Luna 25 Crash: చంద్రుడిపై పరిశోధనలు జరిపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 తర్వాత.. కొన్ని రోజులకు లూనా 25 ప్రయోగాన్ని రష్యా చేపట్టింది. అయితే చంద్రుడిపైకి దాదాపు 5 దశాబ్దాల తర్వాత రష్యా ఈ ప్రయోగాన్ని పంపించింది. అయితే చంద్రయాన్ 3 కంటే ముందే జాబిల్లి ఉపరితలంపై ల్యాండ్ అయ్యేలా సిద్ధం చేసిన లూనా 25.. ఆఖరి నిమిషంలో ఫెయిల్ అయి.. చంద్రుడిపై క్రాష్ ల్యాండింగ్ జరిగింది. అయితే ఈ ప్రాంతాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గుర్తించింది. దానికి సంబంధించి ఫోటోలను కూడా తీసి విడుదల చేసింది. లూనా 25 కూలిపోయిన ప్రాంతంలో భారీ గుంత ఏర్పడినట్లు నాసా విడుదల చేసిన ఫోటోల్లో వెల్లడవుతోంది.

అమెరికా నేషనల్‌ ఏరోనాటిక్స్ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేటర్స్‌కు చెందిన లూనార్‌ రికానసెన్స్‌ ఆర్బిటర్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌ తీసిన ఫోటోలను తాజాగా నాసా విడుదల చేసింది. లూనా 25 కూలిపోవడంతో చంద్రుడిపై కొత్తగా గొయ్యి ఏర్పడిందని నాసా వెల్లడించింది. ఈ గుంత సుమారు 10 మీటర్ల వెడల్పు ఉందని తెలిపింది. అయితే ఈ గుంత లూనా 25 ల్యాండింగ్ కోసం నిర్దేశించిన ప్రాంతానికి చాలా దగ్గరగా ఉందని పేర్కొంది. అయితే లూనా 25 కూలిపోవడం కారణంగానే అంత పెద్ద బిలం ఏర్పడి ఉండవచ్చని నాసా అనుమానం వ్యక్తం చేసింది. మరోవైపు.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగే క్రమంలో చివరి నిమిషంలో లూనా 25 ప్రాజెక్టు విఫలమై క్రాష్ ల్యాండింగ్ కావడంతో రష్యా చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు ఓ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసింది.

లూనా 25 ప్రయోగాన్ని ఆగస్టు 11 వ తేదీన రష్యాలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్‌ నుంచి ప్రయోగించారు. దాదాపు పది రోజుల పాటు ప్రయాణించిన లూనా 25 ల్యాండర్‌.. అప్పటివరకు బాగానే పని చేసింది. క్రాష్ ల్యాండింగ్ కావడానికి కొన్ని గంటల ముందు కూడా లూనా 25 చంద్రుడి ఫొటోలను పంపించింది. చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు రష్యా.. దాదాపు 47 ఏళ్ల తర్వాత ప్రయోగం చేపట్టింది. ఇందు కోసం లూనా 25 మిషన్‌ను చేపట్టిన రష్యా.. చంద్రయాన్ 3 లోని విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగడానికి ముందే.. ఆగస్టు 21 వ తేదీన జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగే ప్రయత్నం చేసింది. అయితే చంద్రుడి ఉపరితలానికి కొన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉండగానే ల్యాండర్‌లో టెక్నికల్ ఫెయిల్యూర్‌తో కూలిపోయింది.

Aditya L1 Mission: తొలిసారి సూర్యుడిపైకి ఇస్రో ప్రయోగం.. మరో వారం రోజుల్లో ఆదిత్య ఎల్ 1 మిషన్
Vyommitra: అంతరిక్షంలోకి మహిళా రోబోను పంపనున్న ఇస్రో.. త్వరలోనే గగన్‌యాన్ మిషన్‌

Read More Latest Science & Technology News And Telugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *