[ad_1]
చందమామపై చంద్రయాన్ 3 అడుగుపెట్టడంపై ప్రధాని నరేంద్ర మోదీ అమితానందం వ్యక్తంచేశారు. ప్రయోగం విజయవంతం అయిన వెంటనే చప్పట్లతో ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ.. ఇస్రో శాస్త్రవేత్తల అవిశ్రాంత కృషిని అభినందించారు. ఇలాంటి చారిత్రిక ఘట్టాలు చూస్తుంటే చాలా గర్వంగా ఉందన్నారు.
‘‘ఇస్రో శాస్త్రవ్తేతలు, చంద్రయాన్ ప్రయోగంలో భాగమైన టీమ్‌కు నా అభినందనలు. ఈ అద్భుత క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశాను. చంద్రయాన్ విజయం కోసం 140 కోట్ల మంది భారతీయులు ఎదురు చూశారు. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందే చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు పెట్టాం. చంద్రయాన్ సాధించిన ఘన విజయంతో నా జీవితం ధన్యమైంది. ఈ విజయం దేశం గర్వించే అపూర్వ క్షణాలు. చంద్రయాన్ విజయం నవ భారత జయధ్వానం. బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లినా నా మనసంతా చంద్రయాన్‌పైనే ఉంది. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూశా. ఈ విజయంతో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అమృత కాలంలో ఇది భారత్ తొలి ఘన విజయం. ఇస్రో శాస్త్రవేత్తల కఠోర శ్రమ వల్లే ఇప్పటివరకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఏ దేశమూ చేరుకోని విజయాన్ని సాధించగలిగాం. భారత్ సాధించిన ఈ అద్భుత విజయం భారతదేశానిది మాత్రమే కాదు.. మానవాళి అందరిదీ’’ అని మోదీ తన ప్రసంగంలో వెల్లడించారు.
ఈ విజయంతో చంద్రుడిపై కాలుమోపిన నాలుగో దేశంగా చైనా, రష్యా, అమెరికా తర్వాత నిలిచింది. అయితే దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టిన తొలి దేశంగా భారత్ ఘనత సాధించింది. 2019 లో చంద్రయాన్ 2 విఫలమైన తర్వాత చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఛాలెంజ్‌గా ఇస్రో తీసుకుంది. ఇటీవల రష్యా లూనా 25 ఇటీవల ఫెయిలవడంతో యావత్ ప్రపంచం చంద్రయాన్ 3 వైపు ఆసక్తిగా చూసింది.
Read More Latest Science & Technology News And Telugu News
[ad_2]
Source link
Leave a Reply