money: ఇంట్లో నగదు నిల్వ, డబ్బు ఖర్చుపై పరిమితి ఉందని మీకు తెలుసా ?

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|

money: తినే ఆహారం దగ్గర నుంచి కొనుక్కునే ప్రతిదానికీ ఓ లిమిట్ ఉంటుంది. అదే విధంగా ఆర్థిక వ్యవస్థను సక్రమంగా నిర్వహించడానికి ప్రజలపై ప్రభుత్వాలు కొన్ని పరిమితులను విధిస్తాయి. ఇదే కోవలోకి వచ్చేది నగదు నిల్వ పరిమితి. మన ఇంట్లో ఇంత నగదును మాత్రమే ఉంచుకోవాలి అని లిమిట్ ఉందనే విషయం బహుశా చాలా మందికి తెలియదు.

లెక్కలు చెప్పాల్సిందే:
ఇంట్లో డబ్బు నిల్వ ఉంచుకోవడానికి, నగదుతో లావాదేవీలు జరపడానికి ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించింది. ఆదాయపు పన్ను శాఖ నిబంధనల మేరకు నగదును వినియోగించాల్సి ఉంటుంది. లెక్కలోకి రాని, ఆధారాలు లేని డబ్బు ఇంటిలో ఉంటే భారీగా 20 లక్షల వరకు జరిమానా విధించే అధికారం దర్యాప్తు సంస్థలకు ఉంది.

ఇంట్లో నగదు నిల్వ, డబ్బు ఖర్చుపై పరిమితి ఉందని మీకు తెలుసా ?

ED, CBI మానిటర్ చేస్తాయ్:
ఆయా లావాదేవీలపై పాన్ కార్డు, బ్యాంకు ఖాతాల ద్వారా ఆదాయపు పన్ను శాఖ నిత్యం ఓ కన్నేసి ఉంచుతుంది. నగదు మొత్తాన్ని బట్టి IT విభాగమే కాక కేంద్ర దర్యాప్తు సంస్థలు ED, CBI వంటివి సైతం సోదాలు నిర్వహించే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే, పట్టుబడిన డబ్బును సరైన మార్గంలో సంపాదించినట్లు రుజువు చేసుకోవాల్సిన బాధ్యత సదరు వ్యక్తిదేనని గుర్తుంచుకోవాలి.

137 శాతం జరిమానా:
లెక్కల్లో చూపని నగదు ఇంట్లో పట్టుబడితే బారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ప్రకారం ఆ డబ్బు మూలాన్ని చెప్పలేకపోతే 137 శాతం ఫైన్ విధించవచ్చు. వాటికి సంబంధించిన IT రిటర్నులు ఫైల్ చేసినట్లయితే భయపడాల్సిన అవసరం లేదు.
నగదు లావాదేవీల గురించి పరిమితులు ఎలా ఉన్నాయంటే..

1. ఒక ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరిపితే జరిమానా విధించవచ్చు. అదే మొత్తాన్ని డిపాజిట్ చేసే పక్షంలో పాన్, ఆధార్ సమాచారాన్ని అందించడం తప్పనిసరి.
2. ఒకేసారి 50 వేల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ లేదా విత్‌ డ్రా చేయడానికి పాన్ నంబర్ ఇవ్వాలి.
3. 2 లక్షల కంటే ఎక్కువ నగదుతో షాపింగ్ చేయలేరు. ఒకవేళ కొనుగోళ్లు జరిపితే పాన్, ఆధార్ ఇవ్వాల్సిందే.
4. 30 లక్షల కంటే ఎక్కువ విలువైన ఆస్తి కొనుగోలు లేదా అమ్మకం జరిపితే, సదరు వ్యక్తి దర్యాప్తు సంస్థల పర్యవేక్షణలోనికి వచ్చే అవకాశం ఉంది.
5. క్రెడిట్-డెబిట్ కార్డ్ కార్డ్ చెల్లింపు సమయంలో, లక్ష కంటే ఎక్కువ మొత్తాన్ని ఒకేసారి చెల్లించిన వ్యక్తిని విచారణ చేయవచ్చు.
6. 1 రోజులో బంధువుల నుంచి 2 లక్షల కంటే ఎక్కువ నగదు తీసుకోలేరు. ఇది కూడా బ్యాంకు ద్వారా జరగాల్సి ఉంటుంది.
7. నగదు రూపంలో ఇచ్చే విరాళాల పరిమితిని 2 వేలుగా, వ్యక్తుల నుంచి తీసుకునే రుణాలను 20 వేలుగా నిర్ణయించారు.
8. బ్యాంకు నుంచి 2 కోట్ల కంటే ఎక్కువ నగదు విత్‌ డ్రా చేస్తే TDS చెల్లించాల్సి ఉంటుంది.

English summary

Limitations on monetary spends and cash limit at home

Money in home limits

Story first published: Saturday, March 25, 2023, 9:00 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *