[ad_1]
అల్లం..
అల్లంలో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ఇది శరీరంలో వాపు ప్రక్రియను తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. నాసికా మార్గం, గొంతులో చికాకు కలిగించే.. అలెర్జీలతో బాధపడుతుంటే.. అల్లం ఎంతగానో సహాయపడుతుంది. అల్లంలోని యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ యాంటీఆక్సిడేటివ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు.. అలెర్జీ లక్షణాలను తగ్గిస్తాయి. ఈ సీజన్‌లో వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి.. అల్లం టీ తాగితే మంచిది. మీ వంటల్లోనూ అల్లం చేర్చుకోండి.
(image source – pixabay)
సిట్లస్ పండ్లు..
సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది, ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. మీ డైట్ ఆరెంజ్, నిమ్మ, బత్తాయి, యాపిల్ వంటి పండ్లు చేర్చుకుంటే.. విటమిన్ సి సమృద్ధిగా అందుతుంది.
(image source – pixabay)
Anti Inflammatory Herbs: ఈ మూలికలతో.. శరీరంలో మంట, వాపు తగ్గుతాయి..!
పసుపు..
పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ వంటి వివిధ ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. పసుపులోని కర్కుమిన్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది. దగ్గు, జలుబు, గొంతునొప్పి లాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు పాలలో పసుపు వేసుకుని తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. పసుపులో ఉండే కర్‌క్యుమిన్ శరీరంలో వైరస్ వృద్ధిని అరికడుతుంది. వర్షాకాలం మీ వంటల్లో పసుపును కచ్చితంగా చేర్చుకోవాలి.
(image source – pixabay)
ఉల్లిపాయలు..
ఉల్లిపాయల్లో క్వెర్సెటిన్ అనే బయోఫ్లేవనాయిడ్ ఉంటుంది, ఇది యాంటిహిస్టామైన్‌గా పనిచేస్తుంది. మీరు అలెర్జీలతో బాధపడుతుంటే.. యాంటిహిస్టామైన్లు సహాయపడతాయి. దీనిలో యాంటీఆక్సిడేటివ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. ఉల్లిపాయలో ప్రీబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణాశయానికి మేలు చేస్తాయి, గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
(image source – pixabay)
టమాటాలు..
టొమాటోలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే, వీటిలో లైకోపీన్ ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. శరీరంలో వాపులను నివారించడానికి అరెర్జీలను తగ్గించడానికి తోడ్పుడుతుంది.
(image source – pixabay)
కడుపులో ఈ సమస్యలు ఉంటే.. స్ట్రోక్ ముప్పు పెరుగుతుంది..!
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply